కి‘లేడీ’లు... రూ. 50వేల మేకప్‌ చేయించుకుని బ్యూటీపార్లర్‌ నుంచి తల్లీకూతుళ్ల పరార్..

Published : Jun 18, 2022, 01:20 PM IST
కి‘లేడీ’లు... రూ. 50వేల మేకప్‌ చేయించుకుని బ్యూటీపార్లర్‌ నుంచి తల్లీకూతుళ్ల పరార్..

సారాంశం

బ్రిటన్ లో ఓ విచిత్రమైన మోసం జరిగింది. ఓ తల్లీకూతుళ్లు బ్యూటీపార్లర్ లో రూ. 50వేల విలువైన మేకప్, బ్యూటీట్రీట్మెంట్ తీసుకుని.. బిల్లు కట్టకుండా చెక్కేశారు. దీంతో ఆ యజమాని ఏం చేయాలో పాలుపోక...

బ్రిటన్ : మోసాలు చేయడంలో కూడా విచిత్రాలు ఎన్నుకుంటున్నారు ఇటీవలి కాలంలోని దొంగలు. అలా బ్రిటన్ లో ఓ తల్లీకూతుళ్లు చేసిన మోసం వింటే ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటారు. వీళ్లిద్దరూ ఓ బ్యూటీపార్లర్ లో మేకప్ కు బుక్ చేసుకున్నారు. బొటాక్స్ లాంటి బ్యూటీ ట్రీట్మెంట్లు కూడా అందులో ఉన్నాయి. పార్లర్ యజమానులూ పెద్ద బేరం దొరికిందని సంతోష పడ్డారు. వీరిద్దరూ తాము బుక్ చేసుకున్న సమయానికి కరెక్టుగా పార్లర్ కు వచ్చారు.

ముందుగా కూతురుకి మేకప్, ట్మీట్మెంట్ పూర్తయ్యింది. ఆమె వెళ్లి బయట కూర్చుంది. ఆ తరువాత తల్లికి మొదలు పెట్టారు. ఆమెదీ కంప్లీట్ అయ్యి బిల్లు చెల్లించమనేసరికి ఆమె.. బయటున్న కూతుర్ని పిలుస్తానని చెప్పి.. తన కోట్ ని అక్కడే వదిలేసి వెళ్లింది. వారు ఆమె తిరిగి వస్తుంది కదా అని చూస్తున్నారు. కానీ.. ఆ తల్లీకూతులిద్దరూ అక్కడ్నుంచి పరారయ్యారు. దీంతో పార్లర్ యజమానులు షాక్ అయ్యారు. 

దీనిమీద ఆ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఊరుకోలేదు. వారు మేకప్ వేసుకునేప్పుడు తీసిన ఫొటోలు జతచేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ‘ఆ ఇద్దరు మహిళలు దొంగలని.. తమను నిండా ముంచేశారని.. ఎక్కడైనా కనబడితే.. పట్టుకుని తమకు తెలియజేయాలని.. తమలాగా ఎవ్వరూ మోసపోకూడదని.. ఇది వీరికి రెగ్యులర్ పనిలా అనిపిస్తుందని...’ ఇది ఆ పోస్ట్ సారాంశం.

ఆ పార్లర్ యజమాని పేరు జేడ్ ఆడమ్స్. ఆడమ్స్ (28) రెండు రోజుల క్రితం తన దుకాణానికి ఇద్దరు మహిళలు వచ్చారు. వారు తమను తాము తల్లీ కూతుళ్లని పరిచయం చేసుకున్నారు. ఇద్దరికీ మేకప్‌తో పాటు బొటాక్స్, ఇతర ఖరీదైన చికిత్సలు చేయించుకున్నారు. వారి బిల్లు మొత్తం రూ.48,942 అయ్యింది... ఈ మహిళ ఫొటోను మీరు కూడా షేర్ చేయండి.. అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారిద్దరూ మాట్లాడుకునే విధానం.. బాషను బట్టి వారు ఐరిష్ అయి ఉంటారని చెప్పుకొచ్చాడు. 

ఈ ఘటనపై ఆడమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలూ క్లినిక్‌లో బొటాక్స్, లిప్ ఫిల్లర్స్ చికిత్స కోసం బుక్ చేసుకున్నారని, ఆపై మేకప్ వగైరా చేయించుకున్నారని, డబ్బులు చెల్లించే సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదని అతను చెప్పాడు. 

క్లినిక్ నుంచి ఇలా తప్పించుకున్నారు.. 
ఆడమ్స్ చెప్పినదాని ప్రకారం.. మొదట ఒక మహిళకు చికిత్స పూర్తి కావడంతో వెయిటింగ్ ఏరియాలో కూర్చుంది. రెండో మహిళకు కూడా చికిత్స పూర్తి కాగానే, మొదటి వ్యక్తిని పేమెంట్ కోసం పిలవడానికి వెయిటింగ్ ఏరియాకు వెళ్లింది. ఆ తరువాత కొద్దిసేపటికే ఇద్దరూ అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. అయితే.. రెండో మహిళ వెయిటింగ్ రూంలోకి వెళ్లేముందు ఆమె తన బ్యాగ్ ను ట్రీట్మెంట్ రూంలో వదిలివేసింది. దీనివల్ల అక్కడున్నవాళ్లు ఆమె తిరిగి వస్తుందని అనుకోవాలని అలా చేసింది. 

'మెట్రో యుకె' నివేదిక ప్రకారం, ఆడమ్స్ తాను 18 నెలలుగా క్లినిక్‌ని నడుపుతున్నానని, ఇలాంటి కస్టమర్‌లను ఎప్పుడూ చూడలేదని వాపోయాడు. ఈ ఘరానా మోసగాళ్లైన మహిళలను పట్టుకోవాలని ఆడమ్స్ పోలీసులను సహాయం కోరారు.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే