ఫ్యాషన్ షోలో విషాదం: క్యాట్‌వాక్ చేస్తూ కుప్పకూలిన మోడల్

Siva Kodati |  
Published : Apr 28, 2019, 12:47 PM IST
ఫ్యాషన్ షోలో విషాదం: క్యాట్‌వాక్ చేస్తూ కుప్పకూలిన మోడల్

సారాంశం

సావో పోలోలో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ ముగింపు రోజు కార్యక్రమంలో భాగంగా బ్రెజిల్ మోడల్ టేల్స్ సోర్స్ క్యాట్ వ్యాక్ చేస్తున్నాడు. వాక్ ముగించి వెను తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన టేల్స్.. రన్‌వేపై పడిపోయాడు

క్యాట్ వాక్ చేస్తూ కుప్పకూలి మోడల్ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సావో పోలోలో జరుగుతున్న ఫ్యాషన్ వీక్ ముగింపు రోజు కార్యక్రమంలో భాగంగా బ్రెజిల్ మోడల్ టేల్స్ సోర్స్ క్యాట్ వ్యాక్ చేస్తున్నాడు.

వాక్ ముగించి వెను తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన టేల్స్.. రన్‌వేపై పడిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే సోర్స్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

మోడల్ టేల్స్ సోర్స్ మరణం పట్ల ఫ్యాషన్ వీక్ నిర్వాహకులు సహా తోటి మోడల్స్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Iran: ఇరాన్ ప్రాక్సీ నెట్‌వ‌ర్క్ కొత్త రూపం.. మునుపటి కంటే ఎందుకు ప్రమాదకరం?
Donald Trump: మ‌రో కొత్త పంచాయ‌తీ మొద‌లు పెట్టిన ట్రంప్‌.. హార్మోజ్ మాదే అంటూ ప్ర‌క‌ట‌న