ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ మృతి

By narsimha lodeFirst Published 18, Aug 2018, 3:29 PM IST
Highlights

ఐక్యరాజ్యసమితి మాజీ జనరల్ సెక్రటరీ కోఫీ అన్నన్ శనివారం నాడు మరణించారు. ఆయన వయస్సు 80 ఏళ్లు.  

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి మాజీ జనరల్ సెక్రటరీ కోఫీ అన్నన్ శనివారం నాడు మరణించారు. ఆయన వయస్సు 80 ఏళ్లు.  కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 

కోఫీ అన్నన్ ఐక్యరాజ్యసమితికి 1997 జనవరి నుండి 2006 డిసెంబర్ వరకు సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 2001లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.కోఫీ అన్నన్ ఘనా దేశంలోని కంసీలో 1938 ఏప్రిల్ 8వ తేదీన జన్మించారు. అతని భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 

 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీని అన్నన్  పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్‌ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించారు.ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా ఆఫ్రికా ఖండం నుండి పనిచేసిన తొలి వ్యక్తి అన్నన్ కావడం విశేషం.

Last Updated 9, Sep 2018, 12:34 PM IST