Hafiz Saeed: హఫీజ్‌ సయీద్‌ కుమారుడూ ఉగ్రవాదే: కేంద్ర హోం శాఖ‌

Published : Apr 10, 2022, 05:44 AM IST
Hafiz Saeed: హఫీజ్‌ సయీద్‌ కుమారుడూ ఉగ్రవాదే: కేంద్ర హోం శాఖ‌

సారాంశం

Hafiz Saeed: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ కుమారుడు హఫీజ్‌ తల్హా సయీద్‌(46) కూడా ఉగ్రవాదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని నిబంధనల ప్ర‌కారం.. తల్హా సయీద్‌ పేరును డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులో జాబితాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) చేర్చింది.  

Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి, నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD) చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్‌(46) కూడా ఉగ్రవాదే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోని నిబంధనల ప్ర‌కారం.. తల్హా సయీద్‌ పేరును డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులో జాబితాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) చేర్చింది.
 
హఫీజ్ తల్హా సయీద్..  లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థ సీనియర్ నాయకుడు గానూ.. ఆ సంస్థ క్లెరిక్ విభాగం అధిపతిగా తల్హా సయీద్ ఉన్నాడు. భారత్‌లో ఉగ్రవాదుల నియామకం, నిధుల సేకరణ, ఉగ్ర దాడుల అమ ల్లో తల్హా చురుగ్గా పాల్గొన్నాడని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అతడు పాకిస్థాన్‌లో లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలను సందర్శిస్తున్నాడని, భారత్‌, ఇజ్రాయెల్‌, అమెరికా తదితర పాశ్చాత్యా దేశాలపై యుద్ధం చేయాలని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని వెల్లడించింది. 

తల్హా సయీద్.. పాకిస్తాన్‌లోని వివిధ ఎల్‌ఇటి కేంద్రాల్లో చురుకుగా పాల్గొన్నార‌నీ భారతదేశం, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా,  ఇతర పాశ్చాత్య దేశాలలో భారతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జిహాద్ కోసం ప్రచారం చేస్తున్నప్పుడని  అని పేర్కొంది. 2008లో ముంబై ఉగ్రదాడికి సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్ టెర్రరిస్టు నిరోధక కోర్టు శుక్రవారంనాడు రెండు కేసుల్లో 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ మ‌రుస‌టి రోజే..  తల్హాను డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుగా ఇండియా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడన్న ఆరోపణలపై నమోదైన రెండు కేసుల్లో అతడిని దోషి గా తేల్చిన కోర్టు, జైలు శిక్షతో పాటు సుమారు రూ. 1.38 లక్షల జరిమానాను కూడా విధించింది. 

హఫీజ్ తల్హా సయీద్ ఉగ్రవాదంలో ప్రమేయం ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది.  UAPA కింద అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించిన‌ట్టు పేర్కొంది.  అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించిన సయీద్‌ను టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో జూలై 2019లో అరెస్టు చేశారు.US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ సయీద్‌ను ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా పేర్కొంది. 26 నవంబర్‌, 2008 ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

కశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది హతం జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో లష్కరే తాయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంత్‌నాగ్‌లో ముష్కరులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో గాలింపు చేపట్టిన బలగాలపై కాల్పులు ప్రారంభించారు. బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది హతమయ్యా డు. అతణ్ని లష్కరే ఉగ్రవాదిగా గుర్తించామని అధికారులు తెలిపారు. హఫీజ్‌ సయీద్‌ కుమారుడూ ఉగ్రవాదే: కేంద్రంజమ్మూలో ఆలయంపై దాడి.. విగ్రహాల ధ్వంసంజమ్మూలోని సిధ్రాలో ఓ ఆలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిం ది. శనివారం ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారికి ధ్వంసమైన విగ్రహా లు కనిపించాయి. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే