నీరవ్ మోడీ ఎఫెక్ట్: లవ్ బ్రేకప్, 2 లక్షల డాలర్లు వృధా

By narsimha lodeFirst Published Oct 8, 2018, 6:49 PM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన ఘటనలో   ఆరోపణలు ఎదుర్కొంటున్న  నీరవ్ మోడీ  ఓ ప్రేమ జంట మధ్య కూడ చిచ్చు పెట్టాడు. నకిలీ డైమండ్ రింగ్‌లను తనకు అంటగట్టాడని  ఓ వ్యక్తి  లబోదిబోమంటున్నాడు


కెనడా: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన ఘటనలో   ఆరోపణలు ఎదుర్కొంటున్న  నీరవ్ మోడీ  ఓ ప్రేమ జంట మధ్య కూడ చిచ్చు పెట్టాడు. నకిలీ డైమండ్ రింగ్‌లను తనకు అంటగట్టాడని  ఓ వ్యక్తి  లబోదిబోమంటున్నాడు. నకిలీ రింగ్‌లను ఇవ్వడంతో తన ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ఆయన మనోవేదనకు గురయ్యాడు.

కెనడాకు చెందిన అల్పోన్స్  2012లో  ఓ ఈవెంట్‌లో నీరవ్ మోడీని  కలిశాడు.  వీరిద్దరికి మధ్య మంచి బంధం ఏర్పడింది.  పేమెంట్‌ ప్రాసెసింగ్‌ కంపెనీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా అల్పోన్సో‌గా పనిచేస్తున్నాడు.  అయితే  తాను ప్రేమిస్తున్న యువతికి డైమండ్ రింగ్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేయాలని  అల్పోన్సో భావించాడు. 

2018 ఏప్రిల్ మాసంలో  లక్ష డాలర్ల బడ్జెట్‌లో స్పెషల్ ఎంగేజ్‌మెంట్ రింగ్ పంపాలని  అల్పోన్సో నీరవ్ మోడీకి మెయిల్ చేశాడు. కానీ అప్పటికే నీరవ్‌ మోదీ-పీఎన్‌బీ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ వ్యక్తికి ఈ స్కాం గురించి తెలియలేదు. ఇదే అదునుగా చూసుకుని, నీరవ్‌ మోదీ పర్‌ఫెక్ట్‌ 3.2 క్యారెట్ గుండ్రటి కట్‌ డైమాండ్‌ రింగ్‌ను అల్ఫోన్సోకు పంపించాడు. హై-క్వాలిటీ గ్రేడ్‌, కలర్‌లెస్‌ స్టోన్‌తో ఉన్న దాని ఖరీదు లక్షా 20వేల డాలర్లుగా పేర్కొన్నాడు. 

ఈ రింగ్ తీసుకొన్న అల్పోన్సో లవర్  మరో డిజైన్‌ను కోరుకొంది. తన లవర్ కోరుకొన్న డిజైన్ ను మోడీకి  ఆర్డర్ చేశాడు. ఈ రింగ్ కు 80 వేల డాలర్లు ఖర్చు చేశాడు.  ఈ రెండు రింగ్‌లను కూడ మోడీ అసిస్టెంట్  అరీ తనకు  అందించినట్టు అల్పోన్సో చెబుతున్నాడు. 

ఈ రింగ్‌ల కోసం హంకాంగ్‌లోని నీరవ్ మోడీ అకౌంట్లోకి   అల్పోన్సో  ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే  ఈ రెండు  రింగ్‌లతో తన లవర్‌కు అల్పోన్సో  ప్రపోజ్ చేశాడు. ఆమె కూడ ఈ ప్రేమను అంగీకరించింది. ఇదిలా ఉంటే  డైమండ్‌ రింగ్‌ల ఇన్‌వాయిస్‌, అధికారి సర్టిఫికేట్లను పంపించమని ఎన్నిసార్లు అడిగినా నీరవ్‌ పంపించలేదు. 

సర్టిఫికెట్లు వస్తున్నాయని నీరవ్ మోడీ నమ్మించే ప్రయత్నం చేశారు.  కానీ వాటిని పంపలేదు. అయితే  ఈ రింగ్‌లను తీసుకెళ్లి డైమండ్ విలువను లెక్కగట్టే వారికి చూపించడంతో అవి నకిలీవని తేల్చేశారు. 

ఇదే విషయాన్ని ఆమె తన ప్రియుడు అల్పోన్సో‌కు చెప్పింది. కానీ అతడు నమ్మలేదు. ఈ విషయమై మోడీకి పలుమార్లు  మెయిల్స్ చేసినా అతని నుండి స్పందన లేదు. ఈ రెండు రింగ్ ల కోసం రెండు లక్షల డాలర్లను అల్పోన్సో ఖర్చు చేశాడు.  నకిలీ రింగ్ ల కోసం రెండు లక్షల డాలర్లు ఖర్చు చేసిన అల్పోన్సోకు  ప్రియురాలు బ్రేకప్ చెప్పింది.

దీంతో కోపంగా అల్పోన్సో మరో మెయిల్ కూడ  పెట్టాడు. మోదీకి వ్యతిరేకంగా సివిల్‌ దావా వేశాడు. 4.2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశాడు. 2019 జనవరిలో ఈ కేసు విచారణకు రానుంది. 


 

click me!