ఇరాన్‌లో రద్దీ మార్కెట్‌లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు

Published : Nov 17, 2022, 01:27 AM IST
ఇరాన్‌లో రద్దీ మార్కెట్‌లో ఆందోళనకారులపై కాల్పులు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు

సారాంశం

ఇరాన్‌లో రద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో ఆందోళనకారులు, సెక్యూరిటీ ఫోర్సెస్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కనీసం 10 మంది మరణించినట్టు ఇరాన్ అధికారిక మీడియా బుధవారం రిపోర్ట్ చేసింది.  

న్యూఢిల్లీ: ఇరాన్‌లో ప్రభుత్వం మహిళలకు నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను నిరసిస్తూ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌లో మహ్సా అమీని మరణం తర్వాత ఈ ఆందోళనలు ఉధృతరూపం తీసుకున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను ప్రకటించారు. ఇప్పటికీ ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా, రద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో ఈ ఆందోళనలు చేపడుతుండగా కొందరు నిరసనకారులపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఆందోళనకారులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.

కొన్ని ఉగ్రవాద శక్తులు నిరసనకారులు, భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇరాన్ నైరుతి వైపున ఉండే ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో ఈ కాల్పులు జరిగాయని అధికారిక మీడియా బుధవారం రిపోర్ట్ చేసింది.

Also Read: హిజాబ్‌ల దహనం.. జుట్టు కత్తిరించుకుంటున్న ఇరాన్ మహిళలు.. ఎందుకో తెలుసా?

రెండు మోటార్ సైకిల్స్ పై సాయుధ, ఉగ్రవాద శక్తులు ఇజెహ్ సిటీలోని సెంట్రల్ మార్కెట్‌లోకి వచ్చాయని, అక్కడే నిరసనకారులు, సెక్యూరిటీ ఫోర్సెస్‌పై ఫైరింగ్ చేశాయని ఐఆర్ఎన్ఏ రిపోర్ట్ చేసింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కనీసం 10 మంది మరణించారని పేర్కొంది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.

అక్టోబర్ 26న ఓ ఉగ్రదాడిలో కనీసం 13 మంది మరణించారు. షిరాజ్‌లో జరిగిన ఈ ఘటనకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది.

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ