
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ మోత నిత్యకృత్యంగా మారింది. తాజా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఇవాళ సెంట్రల్ మెక్సికోలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు మరణించారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
సెంట్రల్ మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలోని ఓ బార్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అపసియోల్ అల్టో సిటీలోని ఓ బార్‌లో బుధవారం రాత్రి దుండగులు చొరబడి లోపలున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది మరణించారని, మరో ఇద్దరు తీవ్ర గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయుధాలతో ఒక బృందం బార్‌కు చేరుకుంది. అనంతరం ఆ దుండగులు బార్ లోపల ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు మరణించారని అధికారి తెలిపారు. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళలను ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దుండగులను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ స్పందించారు. కాల్పుల ఘటనలను
తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఆయన 2018లో పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో హత్యలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ లోపెజ్ ఒబ్రాడోర్ పదవీకాలం ఈ ఘటన అత్యంత ప్రమాదకర ఘటన భావిస్తున్నారు.
గతంలోనూ పలుమార్లు కాల్పులు
సెప్టెంబర్‌లో గ్వానాజువాటోలోని ఇరాపుటో నగరంలో కాల్పుల సంఘటన జరిగింది.ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. అలాగే.. ఫిలడెల్ఫియాలోని కెన్సింగ్టన్ , అల్లెఘేనీ ప్రాంతాల్లో అనేక మంది వ్యక్తులు కాల్పులు జరిపారు దుండగులు.ఈ కాల్పుల్లో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.