మరో మహిళతో కలిసి ఎస్సై...: భార్యను చూసి పరారీ, సస్పెన్షన్

Published : Nov 08, 2019, 12:10 PM IST
మరో మహిళతో కలిసి ఎస్సై...: భార్యను చూసి పరారీ, సస్పెన్షన్

సారాంశం

ఎస్సై నర్సింహ మరో మహిళతో కలిసి వేరే ఇంట్లో ఉంటున్నాడు. దాంతో నర్సింహ భార్య ఆ మహిళ ఇంటి ముందు ధర్నాకు దిగింది. భార్యను చూసి ఎస్సై పరారయ్యాడు. నర్సింహపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: ఓ ఎస్సై భార్యను పక్కన పెట్టి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో మహిళతో భర్త ఉన్న ఇంటి వద్ద ఎస్సై నర్సింహ భార్య ఆందోళనకు దిగింది. హైదరాబాదులోని నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో గల మల్లాపూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

మహేశ్వరం ఎస్సైగా పనిచేస్తున్న నర్సింహకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మహిళ ఇంటి వద్ద బంధువులతో కలిసి నర్సింహ భార్య ఆందోళనకు దిగింది. 

తన భార్యను, బంధువులను చూసిన నర్సింహ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసులో నర్సింహ సస్పెండ్ అయ్యాడు. నర్సింహ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : హైదరాబాద్ ఐటీకి పూర్వవైభవం.. ఉద్యోగాల భర్తీలో ఫిబ్రవరి నయా రికార్డ్
Heat Wave Alert : ఈ నాల్రోజులు చుక్కలే... ఈ జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్, ఎల్లో అలర్ట్