హైదరాబాద్ లో ప్లాస్టిక్ పాలు... వేడిచేయగానే ముద్దలాగా..

By telugu teamFirst Published Oct 11, 2019, 11:38 AM IST
Highlights

పాలను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయగా... అవి ముద్దలాగా మారిపోయాయి. తొలుత పాలు విరిగిపోయాయేమోనని వారు భావించారు.కానీ పరిశీలించి చూడగా... వేడికి ప్లాస్టిక్ ముద్దగా మారినట్లు గమనించారు. చేతితో పట్టుకొని తీస్తే.. తీగలాగా సాగుతోంది. దీంతో ఆ దంపతులు ఇద్దరూ మిల్క్ సెంటర్ కి వెళ్లి ఇవేం పాలు ఇలా ఉన్నాయని నిలదీయగా... వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం  చెప్పడం గమనార్హం. అసలు మా దగ్గరే పాలు కొన్నారనడానికి సాక్ష్యం ఏమిటని ప్రశ్నించారు.

మీరు ప్యాకెట్ పాలు కొనుగోలు చేస్తున్నారా..? వాటిని మీ ఇంట్లో చిన్నారులకు కూడా తాగిస్తున్నారా..? అయితే మీరు జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే.. మీరు మీ చిన్నారులకు నిజంగా తాగిస్తున్నది పాలు కాకపోవచ్చు. ప్లాస్టిక్ అవ్వచ్చు. మీరు చదివింది నిజమే.. మనం ఎంతో ఆరోగ్యంగా భావించే తాగే పాలను కొందరు కక్కుర్తిపడి కల్తీ చేస్తున్నారు. దీంతో... ఆరోగ్యం పక్కన పెడితే అనారోగ్యాల పాలౌతున్నారు. తాజాగా ఓ దంపతులు ప్యాకెట్ పాలు కొనుగోలు చేస్తే... అందులో నుంచి ప్లాస్టిక్ పాలు బయటకు వచ్చాయి. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగర శివారు ప్రగతి నగర్ లో ఉండే పవన్, సౌమ్య దంపతులుకు స్థానిక చౌరస్తాలో ఉన్న సాయితేజ మిల్క్ సెంటర్ నుంచి ఓ లీటరు పాలు కొనుగోలు చేశారు. ఆ పాలను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయగా... అవి ముద్దలాగా మారిపోయాయి. తొలుత పాలు విరిగిపోయాయేమోనని వారు భావించారు.

కానీ పరిశీలించి చూడగా... వేడికి ప్లాస్టిక్ ముద్దగా మారినట్లు గమనించారు. చేతితో పట్టుకొని తీస్తే.. తీగలాగా సాగుతోంది. దీంతో ఆ దంపతులు ఇద్దరూ మిల్క్ సెంటర్ కి వెళ్లి ఇవేం పాలు ఇలా ఉన్నాయని నిలదీయగా... వాళ్లు నిర్లక్ష్యంగా సమాధానం  చెప్పడం గమనార్హం. అసలు మా దగ్గరే పాలు కొన్నారనడానికి సాక్ష్యం ఏమిటని ప్రశ్నించారు.

దీంతో ఖంగుతిన్న దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.  పాలు కాగబెడుతుంటే ఎలా ప్లాస్టిక్ గా మారి.. చేతితో పట్టుకుంటే సాగిపోతున్నాయో వీడియో తీశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా... ఈ న్యూస్ చూసి నగర ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. పసి పిల్లలు తాగే పాలను కూడా కల్తీలు చేస్తే ఎలా అంటూ  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

click me!