#SSMB28: ఆ ఆశలేం పెట్టుకోవద్దు, మహేష్ క్లియర్ గా చెప్పేసారట

By Surya Prakash  |  First Published Aug 23, 2022, 10:27 AM IST

ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్‌గా నటిస్తున్నారని, అందుకే ఫిజిక్‌ని సిద్ధం చేసుకున్నారని కూడా వినిపిస్తోంది. SSMB28 సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఏప్రిల్ 28, 2023న విడుదలకానుంది.



మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్  త్వరలో  మొదలుకానుంది.  థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు వెళ్లనున్న ఈ మూవీ వేగవంతంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక అది అలా ఉంటే ఈసినిమా దాదాపుగా ఐదు భాషాల్లో విడుదలకానున్నట్లు  ప్రచారం జరుగుతోంది. 

 తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే సినిమాకు చెందిన టీమ్ ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతోందిట. మహేష్ క్లియర్ గా ఈ విషయం చెప్పారని అంటున్నారు. కాబట్టి హిందీలో రిలీజ్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది.

Latest Videos

ఇక ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది..    ఈ సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఒక పాత్రలో మహేష్ లుక్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని బోగట్టా.

వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి చిత్రయూనిట్ స్పష్టతనిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుత కాలంలో, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ పాత్రలు ఉంటాయని మహేష్ బాబు పాత్రలు ప్రేక్షకులను అలరించేలా ఉండనున్నాయని తెలుస్తోంది. 

మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్ పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు ఖలేజా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
 
 తాజాగా మహేష్ బాబు చొక్కా లేని అవతారంలో ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఇది త్రివిక్రమ్ సినిమా కోసమే అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ షర్ట్‌లెస్‌గా ఉండబోతున్నాడనే ఊహాగానాలకు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ ఓ స్పెషల్ ఏజెంట్‌గా నటిస్తున్నారని, అందుకే ఫిజిక్‌ని సిద్ధం చేసుకున్నారని కూడా వినిపిస్తోంది. SSMB28 సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఏప్రిల్ 28, 2023న విడుదలకానుంది.
 

click me!