మీ కలల ఇంటి నిర్మాణానికి.. ఐదు సూత్రాలు

Siva Kodati |  
Published : Jan 09, 2020, 05:05 PM ISTUpdated : Jan 09, 2020, 05:17 PM IST
మీ కలల ఇంటి నిర్మాణానికి.. ఐదు సూత్రాలు

సారాంశం

మంచి వస్తువులను అలంకారాలుగా ఉపయోగించి, మీ కలలను మేళవించి సొంత ఇంటిని నిర్మించుకోండి. ఇల్లు నిర్మించే విధానం పట్ల పూర్తి శ్రద్ద, జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం. ఎందుకంటే అది మీ జీవితానికే ఒక ఆకారం.

విద్యుత్ సంబంధిత అంశాలు: 


ఇంటిని సురక్షితంగా ఉంచే అంశాలలో ముఖ్యమైనది విద్యుత్ నిర్వహణ. ఇల్లు స్వర్గంలా ఉండాలంటే భద్రతకు ఎల్లప్పడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే సమయంలో సురక్షితమైన, నాణ్యమైన వస్తువులను ఉపయోగించడం అత్యవసరం. 

పైకప్పు:


ఇంటి పైకప్పు గాలి, వర్షం, చలి, వడగళ్లు, ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రతిరోజూ మీ పైకప్పు వాతావరణ మార్పులు, ఇతర కారకాల ప్రభావానికి గురవుతుంది. ఇవన్నీ పైకప్పుకు నష్టాన్ని కలిగించడంతో పాటు శిథిలావస్థకు దారి తీస్తుంది. పైకప్పు స్థిరత్వం, నాణ్యత మిగిలిన నిర్మాణానికి భరోసాను అందజేస్తుంది.

ప్లంబింగ్:


భవన నిర్మాణ వ్యవహారాల్లో ప్లంబింగ్ అనేది అతి ముఖ్యమైనది. ప్లంబర్ సహాయం లేకుండా భవనాన్ని పూర్తి చేయలేం. పైప్‌లైన్లు, డ్రెయిన్ పైపులు, వాల్స్, అసెంబ్లీంగ్, వంటివి ప్లంబింగ్ కిందకు వస్తాయి. నిర్మాణ సమయంలో ప్లంబింగ్‌‌లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంటిలో నీటి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. 

లివింగ్ రూమ్:


లివింగ్ రూమ్ ఇంటిలో నివసిస్తున్న వారితో పాటు ఇతర గదుల మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తుంది. ఇది ఇంటి ప్రధాన ద్వారానికి దగ్గరగా ఉండటంతో పాటు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. సాధారణంగా లివింగ్ రూమ్ అనేది ఇంటిలోనే పెద్దగది కాబట్టి ఇక్కడ వేడుకలు, ఇతర కార్యక్రమాలకు నిర్వహించడానికి వీలు కలుగుతుంది. 

మరికొన్ని విషయాలు: 


మంచి వస్తువులను అలంకారాలుగా ఉపయోగించి, మీ కలలను మేళవించి సొంత ఇంటిని నిర్మించుకోండి. ఇల్లు నిర్మించే విధానం పట్ల పూర్తి శ్రద్ద, జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం. ఎందుకంటే అది మీ జీవితానికే ఒక ఆకారం.

PREV
click me!

Recommended Stories

ఈఎస్ఐసీ ఆస్పత్రుల ఆధునీకరణకు కేంద్రం ప్రణాళికలు.. త్వరలో రామచంద్రాపురం, నాచారంలో ప్రారంభం..
కరోనా కొత్త వేరియంట్ పై ‘ఇన్సాకాగ్’ ప్రత్యేక దృష్టి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు..