జియో రూ.91 ప్లాన్‌తో కస్టమర్‌లు 28 రోజుల వాలిడిటీతో మొత్తం 3 GB డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 50 ఎస్‌ఎంఎస్ ల సౌకర్యం పొందుతారు. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా చౌకైన ప్లాన్ ధర కూడా రూ.99. జియో కొత్త ప్లాన్‌ల ధరలు డిసెంబర్ 1 నుంచి వర్తిస్తాయి.
జియో Vs ఎయిర్‌టెల్ Vs వోడాఫోన్ ఐడియా: 28 రోజుల ప్లాన్
జియో ప్లాన్
జియో రూ.129 ప్లాన్ డిసెంబర్ 1 నుంచి రూ.155గా ఉంటుంది. ఇందులో మొత్తం 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
జియో రూ.199 ప్లాన్ ధర ఇప్పుడు రూ.239కి పెరిగింది. రోజుకు 1.5 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్‌లు ఉంటాయి.
ఇప్పుడు రూ.249 ప్లాన్ కోసం రూ.299 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రోజుకు 2 GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
వోడాఫోన్ ఐడియా ప్లాన్
వోడాఫోన్ ఐడియా రూ.149 ప్లాన్ ఇప్పుడు రూ.179గా మారింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వాలిడిటీ మొత్తం 2 GB డేటా, 300 ఎస్‌ఎంఎస్ లు, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది.
వోడాఫోన్ ఐడియా ఇప్పుడు రూ.219 ప్లాన్ ధరను రూ.269కి పెంచింది. ఇందులో ప్రతిరోజూ 100 SMSలతో 1 GB డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ కి పోటీగా ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ. 265.
గతంలో రూ.249గా ఉన్న విఐ ప్లాన్ ఇప్పుడు రూ.299కి పెరిగింది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఇందులో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 100 SMS, ప్రతిరోజూ 1.5 GB డేటా అందుబాటులో ఉంటుంది.
విఐ కస్టమర్లు ఇప్పుడు రూ.299కి బదులుగా రూ.359 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 2జిబి డేటా, 100 SMSలను పొందుతారు. దీని వాలిడిటీ 28 రోజులు.
ఎయిర్‌టెల్ ప్లాన్లు
ఎయిర్‌టెల్ రూ.149 ప్లాన్ ఇప్పుడు రూ.179గా మారింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్ లు, ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది.
ఎయిర్‌టెల్ ఇప్పుడు రూ.219 ప్లాన్ ధరను రూ.265కి పెంచింది. ఇందులో ప్రతిరోజూ 100 SMSలతో 1 GB డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 28 రోజులు.
గతంలో రూ.249గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.299కి పెరిగింది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఇందులో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 100 SMS,ప్రతిరోజూ 1.5 GB డేటా అందుబాటులో ఉంటుంది.
రూ.298కి బదులుగా ఇప్పుడు రూ.359 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 2 GB డేటా, 100 SMSలను పొందుతారు. దీని వాలిడిటీ 28 రోజులు.
Jio Vs Airtel Vs vi: 56 రోజుల ప్లాన్
జియో ప్లాన్లు
జియో 56 రోజుల వాలిడిటీ ప్లాన్ రూ.399 డిసెంబర్ 1 నుండి రూ.479 మారనుంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
జియో రూ.444 ప్లాన్ ధర ఇప్పుడు రూ.533కి పెరిగింది. రోజుకు 2 GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ వస్తాయి.
ఎయిర్‌టెల్ ప్లాన్లు
56 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.479గా మారింది. ఇందులో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ పెంపు తర్వాత 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.449 ప్లాన్ ఇప్పుడు రూ.549గా మారింది. ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMS సౌకర్యంతో రోజుకు 2 GB డేటా లభిస్తుంది.
వోడాఫోన్ ఐడియా ప్లాన్లు
56 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న వోడాఫోన్ ఐడియా రూ.399 ప్లాన్ ఇప్పుడు రూ.479గా మారింది. ఇందులో కస్టమర్లు రోజుకు 1.5 GB డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMSలను పొందుతారు.
ఈ పెరుగుదల తర్వాత 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.449 ప్లాన్ ఇప్పుడు రూ.539గా మారింది. ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 SMS సౌకర్యంతో రోజుకు 2 GB డేటా ఉంటుంది. ఈ ధర వద్ద ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్ ధర రూ.549కి పెరిగింది.
telecom
Jio Vs Airtel Vs vi: 84 రోజుల ప్లాన్
జియో ప్లాన్లు
జియో 84 రోజుల రూ. 329 ప్లాన్ ఇప్పుడు రూ. 395గా మారింది. ఇందులో మొత్తం 6 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 1000 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
రూ.555 ప్లాన్ ఇప్పుడు రూ.666గా మారింది. ఇందులో 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
జియో 84 రోజుల ప్లాన్ రూ.599 ఇప్పుడు రూ.719గా మారింది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటాతో ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్‌టెల్ ప్లాన్లు
84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఎయిర్‌టెల్ రూ.379 ప్లాన్ ఇప్పుడు రూ.455గా మారింది. మొత్తం 6 GB డేటా, రోజుకు 100 SMS, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది.
రూ.598 ప్లాన్ ఇప్పుడు రూ.719గా మారింది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
రూ.698 ప్లాన్ ఇప్పుడు రూ.839గా మారింది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్, 100 మెసేజ్‌లు అందుబాటులో ఉంటాయి.
వోడాఫోన్ ఐడియా ప్లాన్లు
84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న కంపెనీ రూ.379 ప్లాన్ ఇప్పుడు రూ.459గా మారింది. మొత్తం 6 GB డేటా, రోజుకు 100 SMS, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు.
వోడాఫోన్ రూ.599 ప్రీ-పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.719 మారింది. రోజుకు 1.5 GB డేటా, రోజుకు 100 SMS, 84 రోజుల వాలిడిటీతో ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని ఇస్తుంది.
వోడాఫోన్ ఐడియా రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.839కి పెరిగింది. 84 రోజుల వాలిడిటీతో ప్రతిరోజూ 2 GB డేటా, ప్రతిరోజూ 100 SMS, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని ఇస్తుంది.