సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే జైలు శిక్ష తప్పదు..

First Published Jan 22, 2021, 12:39 PM IST

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉపయోగించని వారు  ఉండరు. ప్రతి ఒక్కరికీ కనీసం ఏదో ఒక సోషల్ మీడియా మీడియా అక్కౌంట్ ఉండే ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మీరు మీకు తెలియకుండానే ఒకోసారి కొన్ని తప్పులు చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది.  సాధారణంగా సోషల్ మీడియా లో కనిపించే వార్తలు, సమాచారం లేదా ఇంకేదైనా షేర్ చేసే ముందు అది నిజమో కాదో తెలుసుకోవడం మంచిది.
ఎందుకంటే ఒకోసారి మీరు షేర్ చేసే తప్పుడు సమాచారంతో మీరు చట్టపరమైన చర్యలకు గురికావొచ్చు.

సోషల్ మీడియాలో అంటే ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఒక ప్రభుత్వ మంత్రి, ఎంపి, ఎమ్మెల్యే లేదా ప్రభుత్వ అధికారిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు గురవుతారు. అంతేకాకుండా అబద్ధాలు, తప్పుడు సమాచారం, గందరగోళాలను వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా గ్రూప్ లు కూడా దాని పరిధిలోకి వస్తాయి.
undefined
ప్రభుత్వ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే లేదా ప్రభుత్వ అధికారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోస్టులు చేసే వారిపై ఐటి చట్టం కింద కేసులు నమోదు చేయబడుతుంది.
undefined
ఎకనామిక్ క్రైమ్స్ యూనిట్ సైబర్ నేరాలకు నోడల్ ఏజెన్సీ. సోషల్ మీడియాలో అశ్లీలత, సైబర్ బెదిరింపు, సైబర్ వేధింపు వంటి కేసులు ఆర్థిక నేరాల విభాగం పరిధిలోకి వస్తాయి.
undefined
సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే లేదా ప్రతికూల వార్తలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభ్యంతరం చెప్పారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారని సమాచారం. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశం తరువాత, సోషల్ మీడియాలో సరైన సమాచారం మాత్రమే ప్రజలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖను కోరారు.
undefined
అలాగే సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి కమ్యూనికేషన్ విభాగాన్ని రూపొందించడానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) కూడా పరిశీలిస్తోంది. ఇది కాకుండా సోషల్ మీడియా ద్వారా పోలీసులు క్రిమినల్ కేసుల గురించి ప్రజలకు అప్ డేట్ లు ఇస్తూ ఉంటారు, తద్వారా సరైన సమాచారం ప్రజలకు చేరుతుంది, ప్రజలలో గందరగోళం లేకుండా ఉంటుంది.
undefined
సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం సైబర్ నేరాల పరిధిలోకి వస్తుందని ఆర్థిక నేరాల విభాగానికి చెందిన ఎడిజి నాయర్ ఖాన్ అన్నారు . ప్రభుత్వ మంత్రి, ఎంపి, ఎమ్మెల్యే లేదా ప్రభుత్వ అధికారిపై అభ్యంతరకరమైన లేదా తప్పుదోవ పట్టించే వ్యాఖ్య చేస్తే ఆ వ్యక్తి పై సైబర్ నేరాల కింద కఠిన చర్యలు తీసుకొబడతాయి అన్నారు.
undefined
undefined
click me!