నోరూరించే చికెన్ వెరైటీలు.. తిన్నారంటే ఫిదా అయిపోతారు...

First Published | Feb 26, 2021, 3:27 PM IST

చికెన్ అంటే ఇష్టపడని ఫుడ్ లవర్స్ ఉండరు. ఇంకా కొంతమంది అయితే చికెన్ తప్ప వేరే నాన్ వెజ్ ఐటమ్ ఏదీ ముట్టరు. వీరికి చికెన్ లేకపోతే ముద్దదిగదు. అందుకే చికెన్ లో ఎన్నో వెరైటీలు ట్రై చేస్తుంటారు. అలాంటి చికెన్ ప్రియుల కోసం దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కొన్ని చికెన్ వెరైటీస్...

చికెన్ అంటే ఇష్టపడని ఫుడ్ లవర్స్ ఉండరు. ఇంకా కొంతమంది అయితే చికెన్ తప్ప వేరే నాన్ వెజ్ ఐటమ్ ఏదీ ముట్టరు. వీరికి చికెన్ లేకపోతే ముద్దదిగదు. అందుకే చికెన్ లో ఎన్నో వెరైటీలు ట్రై చేస్తుంటారు. అలాంటి చికెన్ ప్రియుల కోసం దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కొన్ని చికెన్ వెరైటీస్...
undefined
బట్టర్ చికెన్ : ఇండియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న చికెన్ వంటకం ఇది. టమాటాలు, ఉల్లిపాయలు, క్రీమ్ తో చేసే ఈ చికెన్ వంటకం పేరు చెబితేనే నోట్లో నీళ్లూరడం మొదలవుతుంది.
undefined

Latest Videos


దీనికోసం చికెన్ ను మారినేట్ చేసి రాత్రంతా నానబెడతారు. ఆ తరువాత టమాటా ప్యూరీ, క్రీమ్, మసాలాలలో మ్యారినేట్ చేసిన చికెన్ ను ఉడికిస్తారు. నార్త్ ఇండియన్ స్టైల్ చికెన్ వంటకం ఇది. అయితే దేశ వ్యాప్తంగా దీని రుచికి ఫిదా అవుతుంటారు.రాత్రి పూట డిన్నర్ కి మంచి రుచికరమైన ఐటమ్ గా దీన్ని చాలామంది ఇష్టపడతారు. చపాతీ, రోటీ, నాన్, పరోటాలతో తింటే చాలా బాగుంటుంది.
undefined
మాల్వానీ చికెన్ : కొబ్బరిపాలతో చేసే ఈ చికెన్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఒక్కసారి దీన్ని రుచి చూశారంటే మీరస్సలు వదిలిపెట్టరు. దీనికి బాగా రుచిని తెచ్చిపెట్టేది ఏంటంటే మహారాష్ట్ర మాల్వాని మసాలా.
undefined
ఈ చికెన్ రెసిపీ మొత్తం కొబ్బరిపాలు, తాజాగా నూరిన మాల్వాని మసాలా మీదే ఆధారపడి ఉంటుంది. మసాలా ప్రేమికులకు బాగా ఇష్టమైన చికెన్ వంటకం ఇది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో ఇది బాగా ఫేమస్ రెసిపీ. ఒక్కసారి తిన్నారంటే మీ నాలుక ఈ రుచిని పదే పదే కోరుకుంటూనే ఉంటుంది.
undefined
కేరళ చికెన్ స్టూ : నిజానికి ఇది బ్రిటిష్ వంటకం. అయితే దీన్ని కేరళకు చెందిన ఓ చెఫ్ మలయాళీ స్టైల్లోకి మార్చేశాడు. కొబ్బరి పాలు, రకరకాల మసాలాలు కలిసి ఈ వంటకానికి కేరళ పేరు తెచ్చిపెట్టాడు. అప్పంతో తింటే ఈ చికెన్ చాలా బాగుంటుంది.
undefined
ఇప్పుడిది కేరళ సంప్రదాయ వంటకంగా మారిపోయింది. పండుగల సమయంలో తప్పనిసరిగా ఈ వంటకాన్ని చేసుకుంటారు. ముఖ్యంగా ఈస్టర్ రోజు చేసే ప్రత్యేకవంటకంలో చికెన్ స్టూ తప్పకుండా ఉంటుంది. దీన్ని ఇంట్లో చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. కొబ్బరి పాలలో ఉడికించి, ఘుమఘుమలాడే మసాలాలతో చేసే ఈ వంటకం బియ్యం అప్పంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
undefined
చికెన్ జాకుటి : పేరు కాస్త విచిత్రంగా ఉన్నా చికెన్ ఉంది కాబట్టి సర్దుకుపోవచ్చు. పేరుకు తగ్గట్టే ఇది గోవా డిష్. కొబ్బరి, జీడిపప్పు, తెల్ల గసగసాలు వేసి మంచి మసాలా ఘాటు, దట్టించిన కారంతో ఉండే చికెన్ వెరైటీ ఇది.కొబ్బరి, గసగసాల రుచికి వెల్లుల్లి మరింత రుచిని జోడించడంతో ఈ చికెన్ కర్రీ అద్భుతంగా తయారవుతుంది. దీన్ని అన్నంతో తింటే చాలా బాగుంటుంది.
undefined
చికెన్ దో ప్యాజా : పేరులోనే ఉంది కదా.. ఈ చికెన్ స్పెషల్ తయారీలో ఉల్లిగడ్డలు ఎక్కువగా వాడతారు. మామూలు చికెన్ కర్రీకి వాడేదానికి సింపుల్ గా రెండు, మూడు రెట్లు ఉల్లిపాయలు వేస్తారు. అందుకే దీనికీ పేరు వచ్చింది.
undefined
ఈ వంటకం తయారీలో తాజాగా తయారుచేసిన గరం మసాలా, అల్లం-వెల్లుల్లి, కసూరి మేతీ, క్రీమ్, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసే పంజాబీ వంటకం. ఉల్లిపాయలు ఎక్కువగా వాడతారు కాబట్టి కూర కొంచెం తియ్యగా ఉంటుంది. అయితే ఇందులో వేసే మసాలాల వల్ల తీపి బ్యాలెన్స్ అవుతుంది. ఈ వంటకం చికెన్ లవర్స్ కు, మసాలా లవర్స్ కు ఒక్కసారి రుచి చూస్తే బాగా ఇష్టంగా మారిపోయే ఆహారం.
undefined
కొల్హాపురి చికెన్ కర్రీ : మహారాష్ట్ర వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన వంటకం ఇది. మంచిగా ఉడికిన చికెన్, దానికి తగిన మసాలాల మిశ్రమం ఈ వంటకాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసింది.మాంచి కారం, రుచి పోటీపడుతూ ఉండే కొల్హాపురి వంటకాలకు ఈ చికెన్ కర్రీ కూడా తక్కువేం కాదు. వేరుశెనగ నూనె, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు, లవంగాలు కూరకు మరింత రుచిని జోడిస్తాయి. వీటిని అప్పటికప్పుడు నూరి వేయడం, దీనికి తోడు అప్పుడే తురిమిన కొబ్బరి వల్ల వాటి అరోమా జిహ్వకు పండగ చేస్తుంది.
undefined
ఆంధ్ర కోడికూర : ఈ కూర తినాలంటే కంపల్సరీ చెంబుడు నీళ్లు పక్కన పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆ కారం, మసాలాలు మీ నషాళానికి అంటుతాయి. ఈ చికెన్ రెసిపీలో సుగంధ ద్రవ్యాలు, మూలికలు, జీడిపప్పులతో గొప్ప రుచిగా ఉంటుంది.
undefined
ఈ కారం, మసాలా ఒక్కసారి రుచి చూస్తే ఇక ఏ చికెన్ వంటకాన్నీ ఇష్టపడనంతగా అడిక్ట్ అయిపోతారు. అన్నంతో, చపాతీతో అంతే రుచిని ఇచ్చే ఈ వంటకం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్.
undefined
చికెన్ రెజాలా : మొఘలాయ్ మూలాలు కలిగిన ప్రసిద్ధ బెంగాలీ వంటకం ముర్గ్ రెజాలా. జీడిపప్పు పేస్ట్, ఖోయా, కొబ్బరి, మసాలాలతో తయారయ్యే ఈ వంటకం ఏ రకమైన విందుకైనా సరిగ్గా సరిపోతుంది. బోన్ లెస్ చికెన్ తో తయారు చేసే ఈ వంటకం ఎంతో రుచిగా ఉంటుంది.
undefined
click me!