`బాహుబలి` రికార్డ్ లు బ్రేక్‌ చేసే సత్తా `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఉందా?.. తారక్‌, చరణ్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్ మధ్య వార్‌

Published : Mar 25, 2022, 10:29 PM ISTUpdated : Mar 26, 2022, 10:08 AM IST

`బాహుబలి` తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన `ఆర్ఆర్‌ఆర్‌`. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలై బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది.  తాజాగా `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`కి మధ్య పోలికలు ప్రారంభమయ్యాయి. ఫ్యాన్స్ మధ్య రచ్చ స్టార్ట్ అయ్యింది.   

PREV
16
`బాహుబలి` రికార్డ్ లు బ్రేక్‌ చేసే సత్తా `ఆర్‌ఆర్‌ఆర్‌`కి  ఉందా?.. తారక్‌, చరణ్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్ మధ్య వార్‌
RRR v/s Bahubali.

`ఆర్‌ఆర్‌ఆర్‌` (RRR) సినిమా ఫస్ట్ షో నుంచి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. సినిమా అదిరిపోయేలా ఉందని, రాజమౌళి మరోసారి తనేంటో చూపించారని అంటున్నారు. భారీ స్థాయిలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం తొలిరోజు కలెక్షన్లు ఇండియన్‌ సినిమా రికార్డు లను తిరగరాయబోతున్నాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు రెండు వందల కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. 

26
RRR v/s Bahubali.

మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని `బాహుబలి`(Bahubali2)తో పోల్చడం కూడా ప్రారంభమైంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` నచ్చని వాళ్లు `బాహుబలి 2` సినిమాని తెరపైకి తీసుకొస్తున్నారు. దాన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. `బాహుబలి 2` ని మించే సినిమా అవలేదంటున్నారు. మరికొందరు `బాహుబలి`ని మించిన సినిమాగా అభివర్ణిస్తున్నారు. ఇది సంచలనాలు క్రియేట్‌ చేయడం ఖాయమంటున్నారు. లాంగ్‌ రన్‌లో సినిమా అన్ని ఇండియన్‌ సినిమా రికార్డు లను తిరగరాస్తుందనే కామెంట్‌ కూడా వినిపిస్తుంది. `బాహుబలి 2` సుమారు 1800కోట్లు కలెక్ట్ చేసిన విషయంతెలిసిందే. RRR v/s Bahubali.
 

36
RRR v/s Bahubali.

అయితే ఇంటర్నెట్‌లో మాత్రం `బాహుబలి` సినిమా ట్రెండ్‌ అవుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. `బాహుబలి` సినిమా రికార్డులు పదిలం అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో కంపేర్‌ చేస్తూ `బాహుబలి 2`ని టచ్‌ చేయడం కష్టమే అని ప్రభాస్‌ ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి వినిపిస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` అత్యధిక టికెట్‌ రేట్లతో విడుదలయ్యింది. అత్యధిక థియేటర్లలో అయ్యిందని, `బాహుబలి` టైమ్‌లో ఇలాంటి రేట్లు లేవని, కానీ `బాహుబలి`ని `ఆర్‌ఆర్‌ఆర్‌` దాటబోదని స్పష్టం చేస్తున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్. 

46
RRR v/s Bahubali.

ఈ సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. `బాహుబలి`లో రాజ్యం, ప్రతీకారం, తిరుగుబాటు అనే పాయింట్‌ని, మదర్‌ సెంటిమెంట్‌ని బాగా చూపించారు రాజమౌళి. యాక్షన్‌, కామెడీ, రొమాన్స్, గ్లామర్‌ అంశాలు సైతం పుష్కలంగా ఉన్నాయి. అన్నింటిని బ్యాలెన్స్ చేశాడు. బిగ్గెస్ట్ ట్విస్ట్ తో మొదటి భాగం నుంచి రెండో భాగంపై ఆసక్తిని పెంచాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే పాయింట్‌తోనే `బాహుబలి 2`ని ప్రపంచానికి తెలిసేలా చేశాడు రాజమౌళి. 
 

56
RRR v/s Bahubali.

కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ప్రధానంగా ఎమోషన్‌ మిస్‌ అయ్యిందని, బాలికని తీసుకెళ్లారనే పాయింట్‌ చాలా చిన్నదైపోయిందని, కాసేపటికి ఆ పాయింట్‌ ట్రాక్‌ తప్పిందని, దీంతో సినిమాలో సోల్‌ మిస్‌ అయ్యిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తోపాటు క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎలాంటి ట్విస్ట్ లు లేవని, దీంతో సినిమా చప్పగా సాగిందని, ఎపిసోడ్ల వైజ్‌గా సినిమా బాగుందని, కానీ ఓవరాల్‌గా చూస్తే  బోరింగ్‌గా ఉందని విమర్శిస్తున్నారు. ఫ్రెండ్‌ షిప్‌ కోసం ఏకంగా గంట టైమ్‌ తీసుకోవడం, ఇద్దరు హీరోల ఎలివేషన్‌ సీన్లకే ప్రయారిటీ ఇచ్చారు గానీ ఎమోషన్స్ ని రాజమౌళి వదిలేశారని అంటున్నారు. అసలైన ఫ్లాట్‌ వీక్‌గా ఉందని, అజయ్‌ దేవగన్‌ ఎపిసోడ్‌ కథ అడ్డంకిగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అనేక లాజిక్కులను రాజమౌళి పట్టించుకోలేదని అంటున్నారు. `నాటు నాటు` సాంగ్‌, `కొమురంభీముడో` సాంగ్‌ తప్ప మరేది మెప్పించలేకపోయాయని కామెంట్లు చేస్తున్నారు. 

66
RRR v/s Bahubali.

ఏదేమైనా `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ ఇష్టపడుతుండగా, జనరల్‌ ఆడియెన్స్ నుంచి, ప్రభాస్‌ ఫ్యాన్స్ నుంచి మాత్రం నెగటివ్‌ కామెంట్లు వస్తున్నాయి. దీంతో `బాహుబలి`ని రీచ్‌ అయ్యే ఛాన్స్ లేదని, ఈ సినిమాకి లాంగ్‌ రన్‌ ఉండదని అంటున్నారు. వెయ్యి కోట్లు వరకు వెళ్లడం కూడా కష్టమే అనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి, ప్రభాస్‌ ఫ్యాన్స్ కి మధ్య సోషల్‌ మీడియాలో రచ్చ నడుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు వెయిట్‌ చేయాల్సిందే.  RRR v/s Bahubali.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories