ప్రభాస్ హీరోయిన్ అందుకే సినిమాలు మానేసిందిట..ఆశ్చర్యమే
First Published | Nov 26, 2020, 11:12 PM ISTరిచా గంగోపాధ్యాయ గుర్తుందా....శేఖర్ కమ్ముల ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాగ నాగవల్లి, మిరపరాయ్, సారొచ్చారు, మిర్చి, భాయ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి పామ్ లో ఉండగానే హటాత్తుగా సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన రిచా అమెరికా వెళ్లిపోయింది. అలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్దం కాలేదు. ఎవరికి తోచిన వెర్షన్ వారు చెప్పుకున్నారు. ఆమె కు ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని అందుకే ఫిల్మ్ ఫీల్డ్ వదిలేసిందని మీడియాలో వార్తలు సైతం అప్పట్లో వచ్చాయి. అయితే ఆమె చదువుమీద మక్కువతోనే అమెరికా వెళ్లిందని ఆమె సన్నిహితలు అన్నారు. అసలేం జరిగిందో ఎవరికీ అర్దం కాలేదు. ఈలోగా పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. అసలు రిచా జీవితంలో ఏం జరిగింది. అనే విషయాలు ఆమె మాటల్లోనే చూద్దాం.