ప్రముఖ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి జరిగినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. చాలా మంది సెటైర్లు వేశారు. మహాలక్ష్మి, రవీందర్ ఇద్దరిపై జోకులు వేశారు. అయినా కూడా ఈ జంట భార్య భర్తలుగా వైవాహిక జీవితంలో ముందుకెళుతున్నారు.