ఎంతో ఆకర్షణీయంగా వరుణ్ తేజ్, లావణ్య శుభలేఖ.. చిరు, పవన్ లని హైలైట్ చేస్తూ..రిసెప్షన్ డేట్ ఫిక్స్

Sreeharsha Gopagani | Published : Oct 26, 2023 7:04 PM
Google News Follow Us

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. 

16
ఎంతో ఆకర్షణీయంగా వరుణ్ తేజ్, లావణ్య శుభలేఖ.. చిరు, పవన్ లని హైలైట్ చేస్తూ..రిసెప్షన్ డేట్ ఫిక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొన్ని రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. 

26

మిస్టర్ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే. అందుకే సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యూని కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి. ఇక వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేయడమే మిగిలి ఉంది. 

36

పెళ్ళికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. వెడ్డింగ్ ఇటలీలో కావడంతో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ అక్కడికి వెళతారు. వీరితోపాటు మరికొంతమంది బంధువులు స్నేహితులు వెళతారు. అయితే పూర్తి స్థాయిలో గెస్ట్ లని హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కి ఇన్వైట్ చేస్తున్నారు. ఈ మేరకు రిసెప్షన్ డేట్ అండ్ వెన్యూ కూడా ఫిక్స్ అయ్యాయి. 

Related Articles

46

నవంబర్ 1న ఇటలీలో పెళ్లి జరగనుండగా.. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనితో రిసెప్షన్ కి సంబందించిన ఇన్విటేషన్ శుభలేఖలని అతిథులందరికి పంచుతున్నారు. శుభలేఖకి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రిసెప్షన్ ఇన్విటేషన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. 

56

శుభలేఖ ముందు భాగంలో వరుణ్, లావణ్య పేర్లలోని V, L అక్షరాలతో లోగో డిజైన్ చేశారు. ఇక లోపల పైభాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకట్రావు ఆశీస్సులతో అని ముద్రించారు. ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం అంటూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ పేర్లని హైలైట్ చేశారు.  

66

ఇక రిసెప్షన్ ఇన్విటేషన్ లో గెస్ట్ లకు అవసరమైన కార్ పాస్ లని కూడా పొందుపరిచారు. వరుణ్ తేజ్, లావణ్య.. మిస్టర్, అంతరిక్షం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు. వీళ్లిద్దరి పెళ్లి దగ్గర పడుతుండడంతో వరుణ్ లవ్ అనే హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి, రిసెప్షన్ దుస్తులు, స్టైలింగ్ ఫైనల్ చేసేందుకు బాలీవుడ్ నుంచి స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రానున్నట్లు తెలుస్తోంది. 

Recommended Photos