Namrata-Upasana: ఇండస్ట్రీ గురించి ఉపాసన కళ్లు తెరిపించిన నమ్రత, సితారతో స్పెషల్‌ బాండింగ్

Published : Oct 29, 2026, 05:01 PM IST

మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో నమ్రత గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది ఉపాసన. సితారతో ఉన్న స్పెషల్‌ బాండింగ్‌ గురించి చెప్పింది.

PREV
14
నమ్రతతో ఉపాసన బాండింగ్‌

మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌ మంచి స్నేహితులు. వీరిద్దరు తరచూ కలుసుకుంటారు. వీరితోపాటు ఎన్టీఆర్‌ కూడా కలుస్తుంటారు. వీరు మాత్రమే కాదు, వీరి ఫ్యామిలీస్‌ కూడా కలుస్తుంటాయి. దీంతో వీరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. హీరోల భార్యలు కూడా మంచి స్నేహితులు. వీరు ఎప్పుడు కలిసినా బాగా చిల్‌ అవుతారట. చాలా విషయాలు చర్చించుకుంటారట. అయితే మహేష్‌ బాబు భార్య, మాజీ హీరోయిన్‌ నమ్రతకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ఉపాసన. రామ్‌ చరణ్‌ చెప్పలేదుగానీ, నమ్రత ఇండస్ట్రీ గురించి చాలా చెప్పిందట.

24
నమ్రత గురించి ఉపాసన చెప్పిన విషయాలు

ఉపాసనది సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ కాదు. మెడికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌. వాళ్ల తాత ప్రతాప్‌ సి రెడ్డి అపోలో ఆసుపత్రిల సామ్రాజ్యానికి ఆధ్యుడు. వేల కోట్ల సంపాదన కర్త. ఆయన వారసత్వంగా ఉపాసన కూడా అందులో కీలక పదవిలో ఉన్నారు. అయితే ఏదైనా స్పెషల్‌ అకేషన్స్ లో రామ్‌ చరణ్‌, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ ఫ్యామిలీస్‌ కలుస్తుంటాయట. ఈ క్రమంలో నమ్రత గురించి, ఆమె తనకు నేర్పించిన విషయాల గురించి ఉపాసన ఓపెన్‌ అయ్యింది. నిజం చెప్పాలంటే సినిమా పరిశ్రమ గురించి చాలా విషయాలు నమ్రతనే చెప్పిందట. రామ్‌ చరణ్‌ కూడా ఎప్పుడూ చెప్పలేదని, నమ్రత వల్ల చాలా విషయాలు తెలుసుకున్నట్టు తెలిపింది ఉపాసన. దర్శకుడు అంటే ఎవరు? ఏం చేస్తాడు? నిర్మాత ఏంటి? సినిమా ఎలా తీస్తారు ఇలాంటి బేసిక్‌ విషయాలను నమ్రత వల్లే తెలుసుకున్నానని చెప్పింది.

34
సితారతో ఉపాసనకి స్పెషల్‌ బాండింగ్‌

వెకేషన్‌కి వెళితే ఆమెతో చాలా ఎంజాయ్‌గా ఉంటుందని, ఆమెతో చాలా టైమ్ స్పెండ్‌ చేస్తానని, ఆ సమయాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తామని చెప్పింది. అంతేకాదు మహేష్‌ కూతురు సితారతో ఉన్న బాండింగ్ గురించి చెప్పింది ఉపాసన. సితార పుట్టిన రోజు, తన పుట్టిన రోజు ఒక్కటే రోజు అని చెప్పింది. దీంతో తమ మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని, తను చాలా స్వీట్‌ గర్ల్ అని వెల్లడించింది ఉపాసన. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.

44
మహేష్‌ కి బ్యాక్ బోన్‌గా నమ్రత.. అపోలో డైరెక్టర్‌గా ఉపాసన

నమ్రత మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌ బాబుతో కలిసి `వంశీ` చిత్రంలో నటించి ఆయనతో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు మానేసింది నమ్రత. ఇప్పుడు మహేష్‌కి సంబంధించిన అన్నీ తానే చూసుకుంటోంది. వ్యాపారాలు తానే లీడ్‌ చేస్తోంది. ఓ రకంగా మహేష్‌ కి బ్యాన్‌ బోన్‌గా ఉంటుంది. ఉపాసన.. రామ్‌ చరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దల సమక్షంలోనే గ్రాండ్‌ గా వీరి మ్యారేజ్ జరిగింది. ఉపాసన ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories