Guppedantha Manasu Serial Today:శైలేంద్రకు రక్తం ఇచ్చి కాపాడిన మహేంద్ర.. కనిపించకుండా పోయిన రిషి..?

First Published Dec 2, 2023, 8:31 AM IST

ఏమైందని మహేంద్ర అడిగితే, రిషి సర్ ఎక్కడికి వెళ్లారా అని ఆలోచిస్తున్నానని, తనకు ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉందని అంటుంది.  రిషికి ఏం కాదు అని ధైర్యం చెప్పిన మహేంద్ర,  తర్వాత వసు తీసుకొని హాస్పిటల్ లోపలికి వెళతాడు.

Guppedantha Manasu

Guppedantha Manasu Serial Today: రౌడీలు పొడవడంతో శైలేంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉంటాడు. అందరూ ఆ హాస్పిటల్ దగ్గరకు వెళ్తారు. అయితే, రిషి మాత్రం కనిపించడు. వసు రిషి కోసం వెళ్తే, బయటకూడా ఉండడు. ఈలోగా వసుకి రిషి నుంచి మెసేజ్ వస్తుంది. ‘ పని ఉంది బయటకు వెళ్తున్నా, పని అవ్వగానే వస్తాను’ అంటూ మెసేజ్ చేస్తాడు. అదే ఆలోచిస్తూ ఉంటుంది.  అప్పుడే అక్కడకు మహేంద్ర వస్తాడు. వచ్చి రాగానే రిషి గురించి అడుగుతాడు, బయటకు వెళ్లాడని చెబుతుంది. తర్వాత మహేంద్ర శైలేంద్ర మళ్లీ ఏదైనా నాటకం ఆడుతున్నాడా  అనే అనుమానంగా ఉందని మహేంద్ర అంటాడు. అయితే, ధరణి ముందే ఎటాక్ జరిగింది కాబట్టి, నమ్మాల్సిందే మామయ్య అని వసు బదులిస్తుంది, కానీ, మహేంద్రకు మాత్రం ఇదంతా శైలేంద్ర నాటకం అని అనుమానంగానే ఉంటుంది.

Guppedantha Manasu

‘ వాడి మీద ఎటాక్ ఎవరు చేశారు? మన ఫ్యామిలీకి వాడికంటే పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారా? కావాలనే ధరణిని నమ్మించాడానికి ఇదంతా జరగేలా చేసాడేమో? అలా జరిగినా జరగవచ్చు. ఇలాంటి వాటిలో శైలేంద్ర ఆరితేరి ఉన్నాడు. ధరణి ఏదో చెబుతోంది కానీ, నాకు ఎందుకో నమ్మకంగా లేదు. పదవి కోసం ప్రాణాలు తీసేవాడు. రక్తం పంచుకొని పుట్టినవారు, అయిన వాళ్లు అనే తేడా  కూడా లేకుండా  తన స్వార్థం కోసం అందరి నాశనం కోరుకునేవాడు.. అలాంటివాడు ఇలాంటివి ఎందుకు చేయడు..?’ అని మహేంద్ర అంటాడు.

Latest Videos


Guppedantha Manasu

‘ అదే నిజం అయితే, అంతకంటే పిచ్చి పని మరొకటి ఉండదు మామయ్య.  ఎందుకంటే, శైలేంద్ర ఇలా చేసి నిజానికి రెండు మూడు రోజులు వాయిదా వేస్తాడేమో కానీ, నిజం బయటకు రాకుండా ఆపలేరు. ముకుల్ దగ్గర శైలేంద్రే హంతకుడు అనే సాక్ష్యం ఉంది, ముకుల్ కచ్చితంగా శైలేంద్ర దగ్గరకు వస్తాడు.. ఆ వాయిస్ వినిపిస్తాడు. అప్పుడు తప్పించుకోలేడు కదా ’అని వసు అంటుంది.
‘అదీ నిజమేనమ్మ, వాడు మనల్ని డైవర్ట్ చేయడానికీ, ఈలోగా సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్లాన్ చేసి ఉంటాడు. కళ్లు తెరిస్తే, వాడి బతుకు తెల్లారుతుందని వాడికి అర్థం కావడం లేదు. వాడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాడో చూద్దాం. ఇక, వాడి దుర్మార్గానికి రోజులు దగ్గరపడినట్లే’ అని మహేంద్ర అంటాడు. తర్వాత మహేంద్ర లోపలికి వెళదాం రమ్మని వసు అడిగితే, వసు అక్కడే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఏమైందని మహేంద్ర అడిగితే, రిషి సర్ ఎక్కడికి వెళ్లారా అని ఆలోచిస్తున్నానని, తనకు ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉందని అంటుంది.  రిషికి ఏం కాదు అని ధైర్యం చెప్పిన మహేంద్ర,  తర్వాత వసు తీసుకొని హాస్పిటల్ లోపలికి వెళతాడు.

Guppedantha Manasu

వాళ్లు లోపలికి వెళ్లే సరికి ధరణి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. ధరణిని కుశల ప్రశ్నలు అడుగుతారు. నొప్పికి ట్యాబ్లెట్ కి వేసుకుంటున్నానని చెబుతుంది.  అప్పుడు కూడా ధరణి శైలేంద్ర గురించే బాధపడుతూ ఉంటుంది. ఎటాక్ ఎలా జరిగిందని మహేంద్ర అడిగుతూ ఉంటాడు. ధరణి సమాధానాలు చెబుతుంది, కానీ, శైలేంద్రే ఈ నాటకం ఆడించాడు అనే  కోణంలో మహేంద్ర కొన్ని ప్రశ్నలుు అడగడంతో ధరణి బాగా హర్ట్ అవుతుంది.  గాయంతో, రక్తం పోయి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, ఇలా మాట్లాడతారేంటి అని  అంటుంది. అసలే, ధరణి తన భర్త పూర్తిగా మారిపోయాడు అనే భ్రమలో ఉండిపోయింది. అందుకే, నిజంగానే శైలేంద్రను ఎవరో ఎటాక్ చేశారనుకొని తెగ ఫీలైపోతూ ఉంటుంది.

Guppedantha Manasu

ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, శైలేంద్ర ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతాడు. కానీ, రక్తం ఎక్కువగా పోయిందని, రక్తం ఎక్కించాలని అంటాడు. దేవయాణి, ఫణీంద్ర రక్తం ఇవ్వడానికి ముందుకు రాగా, వాళ్ల ఏజ్ ఎక్కువ కాబట్టి, వాళ్ల రక్తం తీసుకోలేం అని డాక్టర్ చెబుతాడు. దీంతో ఫణీంద్ర అందరికీ ఫోన్ చేసి రక్తం కావాలని అడుగుతూ ఉంటాడు.  బ్లడ్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఇక, దేవయాణి తన కొడుకుని కాపాడేది ఎవరూ అంటూ ఏఢుస్తుంది. అప్పుడు ఫణీంద్ర.. తన తమ్ముడు మహేంద్ర దగ్గరకు వెళ్లి, తన కొడుకు ప్రాణాలు కాపాడమని వేడుకుంటాడు. తన కోసం తన కొడుక్కి రక్తం ఇవ్వమని, శలేంద్ర కోలుకున్న తర్వాత అన్ని పరిష్కరిద్దాం అని అంటాడు. తన అన్నయ్య అడిగిన మాటలకు మహేంద్ర కరిగిపోతాడు.  వెంటనే రక్తం ఇవ్వడానికి ముందుకు వస్తాడు.

Guppedantha Manasu

వెంటనే డాక్టర్ బ్లడ్ తీసుకోవడానికి మహేంద్రను లోపలికి తీసుకువెళతాడు. నర్స్ కూడా వెంటనే రక్తం తీసుకోవడం మొదలుపెడుతుంది.  సరిగ్గా అప్పుడే శైలేంద్రకు మెళకువ వస్తుంది. పక్కకు తిరిగి మహేంద్రను చూస్తాడు. మహేంద్ర ఇటు తిరిగే లోపు.. మళ్లీ కళ్లు మూసుకుంటాడు. దానిని గమనించిన మహేంద్ర మాట్లాడతాడు. ‘ ఏయ్ శైలేంద్ర.. మా బాబాయ్ నాకు బ్లడ్ ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపతున్నావా? నీ బాగు కోసం నేను రక్తం ఇవ్వడం లేదు. నువ్వు బతకాలని ఇస్తున్నాను. నువ్వు ఇక్కడే, ఇలాగే చచ్చిపోతే  నీ నిజ స్వరూపం బయటపడదు.  నీ తనువుతోనే నీ పాపాలన్నీ సమాధైపోతాయి. నువ్వు మంచివాడిగా అందరి గుండెల్లో మిగిలిపోతావ్. అది జరగడానికి వీళ్లేదు. నీ సమాధి మీద కీర్తి శేషులు అని ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. అపకీర్తి శేషులు శైలేంద్ర అని ఉండాలి. నువ్వు ఎంత మూర్ఖుడివో, నువ్వు చేసిన  నేరాలు ఘోరాలు అన్నీ బయటకు రావాలి. నీ రాక్షసత్వం అందరికీ తెలియాలంటే, నువ్వు బతికే ఉండాలి. అందుకే నీ ముఖం చూడాలంటే చీదరించుకునే నేను నా రక్తం ఇస్తున్నాను. నువ్వు ఇంతకాలం రిషికి దొరకకుండా తప్పించుకున్నావ్. కానీ ఇక నుంచి  నీ ఆటలు సాగవు. నా కళ్లముందే నా కొడుకు చేతిలో నువ్వు చావు దెబ్బలు తినడం ఖాయం. ఈ మాటలన్నీ నువ్వు వింటున్నావని, నా మాటలు నీ తలకు ఎక్కుతున్నాయని నాకు తెలుసురా’ అని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu

మరోసారి కళ్లు తెరిచి చూసిన శైలేంద్ర, కావాలనే ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకుంటాడు. వాళ్ల నాన్న వచ్చేసరికి స్పృహలో లేనట్లు నటిస్తాడు. ఫణీంద్ర లోపలికి వచ్చి తన కొడుకు, తమ్ముడిని చూసుకుంటాడు. తన మహేంద్ర మనసు చాలా గొప్పదని మనసులో అనుకుంటూ ఉంటాడు.  ఆ తర్వాత మహేంద్రకు థ్యాంక్స్ చెబుతాడు. బయట నుంచి వసు వాళ్లను చూస్తుంది. ‘శైలేంద్ర ఎన్ని కుట్రలు చేసినా వాటిని బయటపెట్టకపోవడానికి కారణం మహేంద్ర, ఫణీంద్రల మధ్య ఉన్న అనుబంధమే కారణం. దానిని శైలేంద్ర అలుసుగా చేసుకొని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. శైలేంద్ర గురించి నిజం తెలిస్తే, ఫణీంద్ర సర్ తట్టుకోలేరు. కానీ ఆ నిజం బయటపడిన రోజు తట్టుకునే ధైర్యం మీకు ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాన్ సర్.’ అని మనసులో అనుకుంటూ ఉంటుంది.

Guppedantha Manasu

తర్వాత వసు బయటకు వెళ్లిపోతుంది. రిషి ఇంకా రావాడం లేదు ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ముకుల్ దగ్గరకు వెళ్లాడేమో అనుకునేలోగా ముకుల్ అక్కడికి వచ్చేస్తాడు. అయితే, రిషి సర్ ముకుల్ దగ్గరకు వెళ్లలేదు అనే విషయం వసుకి అర్థమౌతుంది. శైలేంద్రకు ఎలా ఉంది అని అడుగుతాడు. గాయాలు ఎక్కువగానే అయ్యాయి అని వసు చెబుతుంది. తర్వాత శైలేంద్రను చూటానికి లోపలికి వస్తాను అని ముకుల్ అక్కడకు వస్తాడు. అప్పుడే మహేంద్ర రక్తం ఇచ్చి బయటకు వస్తాడు. ముకుల్ ఇంటిరాగేట్ చేస్తాను అంటే, ఫణీంద్ర త్వరగా కోలుకునేంత వరకు ఆగమని చెబుతాడు. మీ కొడుకు అని అలా అంటుున్నారా అని ఫణీంద్రపై ముకుల్ సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!