
తల్లి ఫోన్ చేసిందని మీనా వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత..శివ ప్రవర్తన గురించి ఆమె చెబుతుంది.చదువుకోవడం లేదని,రౌడీ షీటర్ గుణ వెంట తిరుగుతున్నాడని, మందు కూడా తాగుతున్నాడని మొత్తం చెబుతుంది.ఆ మాట విని మీనా షాక్ అవుతుంది. శివకి బుద్ధి చెప్పమని పార్వతమ్మ అడుగుతుంది. కానీ.. బుద్ధి చెప్పాల్సింది శివకి కాదని..గుణకి బుద్ధి చెప్పాలని మీనా డిసైడ్ అవుతుంది. పార్వతమ్మ వద్దు అని చెబుతున్నా వినకుండా.. ఆ గుణకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక రోహిణీ, తన ఫ్రెండ్ వింధ్యతో కలిసి దినేష్ ని కలవడానికి వెళ్తుంది. ‘ నవ్వు ఎక్కడికీ ఒంటరిగా రావా? నీ ఫ్రెండ్ తోక ఉండాల్సిందేనా?’ అని దినేష్ అడుగుతాడు. ‘ఏయ్...నేను తన ఫ్రెండ్ ని. ఎక్కడికైనా వస్తాను నీకెందుకు? ముందు మా ఫ్రెండ్ ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావో చెప్పు..?’ అని వింధ్య సీరియస్ అవుతుంది. ‘ నువ్వు నా కొడుకు దగ్గరకు ఎందుకు వెళ్లావ్?వాడితో ఎందుకు సెల్ఫీ దిగావ్? ఇంతకాలం నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసినా భరించాను.. కానీ నా కొడుకు జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను’ అని రోహిణీ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.‘ కూల్ కళ్యాణీ.. కూల్.. నాకు ఏం కావాలో నీకు తెలుసు.. అది ఇచ్చేస్తే నేను వెళ్లిపోతాను’ అని దినేష్ బదులిస్తాడు. ‘ ప్రతి నెలా ఇలా అడుక్కుంటూనే ఉంటున్నావ్ కదా... ఇంకేం కావాలి?’ అని వింధ్య అంటుంది. ‘ జైల్లో ఉన్నప్పుడు గ్యాప్ వచ్చింది.. నీ భవిష్యత్తు నా చేతుల్లోనే ఉంది..’ అని దినేష్ అంటాడు. ‘ సినిమా డైలాగులు కొట్టకు.. నీకు ఎంత కావాలో చెప్పు’ అని వింధ్య అడుగుతుంది. ‘ పది, పాతికా అడిగి నాకు కూడా బోర్ కొట్టింది.. ఫైనల్ సెటిల్మెంట్ రూ.30లక్షలు ఇవ్వు.. మళ్లీ నీ జోలికి రాను’ అని అంటాడు. ఆ మాట విని రోహిణీ షాక్ అవుతుంది. ‘ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? రూ.30లక్షలు ఏంటి? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి పట్టుకురావాలి? ఇప్పటికే మా షాప్ నుంచి నువ్వు పట్టుకెళ్లిన వస్తువులకి నేను ఈఎంఐ కడుతున్నాను.. తెలుసా నీకు?’ అని రోహిణీ అంటుంది. ‘ నాకు ఆ డబ్బు చాలా అవసరం అందుకే నిన్ను అడగక తప్పడం లేదు’ అని దినేష్ అంటే.. ‘ నా దగ్గర అంత డబ్బు లేదు.. కావాలంటే ఎక్కడైనా రికమండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాను’ అని రోహిణీ సలహా ఇస్తుంది. కానీ దినేష్ వినడు. ఉద్యోగం చేయలేను అని.. తనకు రూ.30లక్షలు ఇవ్వాల్సిందే అని పట్టుపడతాడు. అయితే.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వింధ్య సలహా ఇస్తుంది. దానికి కూడా దినేష్ వెటకారం చేస్తాడు. ‘ నిన్ను లైఫ్ లో మరోసారి ఇబ్బంది పెట్టకూడదని ఫైనల్ సెటిల్మెంట్ అడుగుతున్నాను.. నేను అడిగిన డబ్బులు ఇస్తే.. మళ్లీ నీ జోలికి రాను.. లేదంటే మీ ఇంటికి వెళ్లి నీ కథంతా చెప్పేస్తాను’ అని వార్నింగ్ ఇస్తాడు. త్వరగా డబ్బులు సెటిల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక.. ఆ డబ్బులు ఎలా అని.. వింధ్య, రోహిణీ ఆలోచిస్తారు. ఇద్దరూ కలిసి గుణని కలవాలని డిసైడ్ అవుతారు.
ఇక.. గుణ దగ్గరకు మీనా వస్తుంది. నా తమ్ముడిని చెడగొడుతున్నావ్.. నిన్న ఆఖరికి మందు తాగి వచ్చాడు అని.. మీనా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అయితే.. గుణ మొదట తనకు ఏమీ తెలీదని మాట్లాడి.. తర్వాత ప్లేట్ తిప్పేస్తాడు. ‘ ఏంటి? నీ తమ్ముడు నాతో తిరిగి చెడిపోయాడా? వాడికి డబ్బు సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి.. కావాలంటే వాడిని నా దగ్గరకు రాకుండా ఆపు చూద్దాం..’ అని వార్నింగ్ ఇస్తాడు.మీనా.. మాస్ వార్నింగ్ ఇచ్చి.. చెప్పుతో కొడతాను అని అంటుంది. ఆమాటకు గుణకి కోపం వచ్చి పోవే అంటాడు. ఆ మాటకు కోపం వచ్చిన మీనా.. గుణ చెంప పగలకొడుతుంది. కొట్టిందనే కోపంతో మీనాని గుణ నెడతాడు. అక్కడే ఉన్న ఓ చెక్క బీరువాకి తగిలి.. మీనా తలకు దెబ్బ తగులుతుంది. అది కాస్త బాలు కంట పడుతుంది. వెళ్లి.. మీనాని పట్టుకుంటాడు. పనిలో పనిగా.. నా భార్యపై చెయ్యి చేసుకుంటావా అని.. గుణని బాలు చితకబాదుతాడు. రెండు చేతులు విరగగొట్టి.. ఇంకోసారి మా జోలికి రావద్దని.. శివగాడు నీతో కనిపిస్తే.. నిన్నే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మీనాని తీసుకొని వెళ్లిపోతాడు.
ఇక.. మీనాని బాలు హాస్పిటల్ కి తీసుకువెళతాడు. అక్కడ మీనా తలకు కట్టుకడతారు. తర్వాత స్కానింగ్ చేయాలని డాక్టర్లు చెబుతారు. ఖర్చు ఎక్కువ అవుతుందని మీనా భయపడుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి.. గొడవ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అనవసరంగా ఒంటరిగా వెళ్లాను అని మీనా ఫీలౌతుంది. బాలు కూడా ఇంకోసారి అలా చేయకు అని చెబుతాడు. మీనాని స్కాన్ ని చేయడానికి నర్సు తీసుకువెళతారు. అప్పుడే.. పార్వతమ్మ.. బాలుకి ఫోన్ చేస్తుంది. అక్కడ జరిగినదంతా బాలు చెబుతాడు. ఆమె వెంటనే కంగారుగా హాస్పిటల్ కి రావడానికి బయలుదేరుతుంది. దానికంటే ముందు.. మీనాకి గాయం అయ్యిందని ఆవిడ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే..శివ వస్తాడు. ఏమైందని అడిగితే.. మీనాకు గుణ కారణంగా దెబ్బ తగిలిందనే విషయం చెబుతుంది. ఆ మాట విని శివ కూడా షాక్ అవుతాడు. మీనా తలకు దెబ్బ తగిలిందని తెలియగానే శివ కూడా బాధపడతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
బాలు కొట్టిన దెబ్బలకు గుణ బాధపడుతుంటే.. అక్కడికి శివ వస్తాడు. బాలు వచ్చి కొట్టిన విషయం శివకి చెబుతాడు.కావాలని.. బాలు మీద ఎక్కించాలని చూస్తారు. కానీ.. శివ రివర్స్ అవుతాడు. మా అక్క తలపగల కొడతావా అంటూ సీరియస్ అవుతాడు. తన అక్క జోలికి వచ్చినందుకు శివకు విపరీతంగా కోపం వస్తుంది. మా అక్కకు సారీ చెప్పమని అడుగుతాడు. కానీ.. గుణ క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోడు. ఇంకోసారి నువ్వు సారీ చెప్పకపోతే.. ఇంకెప్పుడూ నీ దగ్గరకు రాను అనేసి.. కోపంగా శివ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అయితే, డాక్టర్ మీనా స్కాన్ చెక్ చేసి.. అంతా బాగానే ఉందని.. నొప్పులకు మందులు రాసి ఇస్తారు. కాసేపు మీనాని అబ్సర్వేషన్ లో ఉండాలని చెబుతారు. మీనా ని అక్కడే ఉంచి.. తినడానికి ఏమైనా తెస్తాను అని బాలు వెళతాడు. అప్పుడే అక్కడికి మీనా తల్లి, చెల్లి, తమ్ముడు వస్తారు. మీనాని చూసి అందరూ ఏడ్చేస్తారు.గుణ చేతులు రెండూ బాలు విరిచేశాడు అని మీనా చెబుతుంది.ఇక పార్వతమ్మ.. శివని తిడుతుంది. నీ వల్ల మీ అక్కకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు అంటూ.. శివని కొడుతుంది. కానీ, మీనా ఆపుతుంది. ఒకరి తర్వాత ఒకరు శివను తిడతారు. తర్వాత.. శివలో మార్పు వస్తుంది. ఇంకోసారి గుణ దగ్గరకు వెళ్లను అని.. తాగను అని, బుద్ధిగా చదువుకుంటాను అని మాట ఇస్తాడు. ఇదంతా బాలు దూరంగా చూస్తూనే ఉంటాడు. కానీ, ఏమీ అనకుండా మీనా కి జ్యూస్ ఇచ్చి..ట్యాబ్లెట్స్ తెస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత.. మీనాని బాలు ఇంటికి తీసుకువస్తాడు. అయితే.. బాలు కారణంగానే మీనాకి దెబ్బ తగిలిందని సత్యం అపార్థం చేసుకుంటాడు. స్కూటీ మీద నుంచి కింద పడిందని బాలు అబద్ధం చెబుతాడు. మీనాని ఇబ్బంది పెట్టకూడదని, బాగా చూసుకోవాలని సత్యం సలహాలు ఇస్తూ ఉంటే.. ప్రభావతి వస్తుంది. దెబ్బ తగిలిందని జాలి పడకపోగా.. వెటకారంగా మాట్లాడి, తిడుతుంది. తర్వాత మీనాపై ప్రభావతి జాలి చూపిస్తుంది. అది చూసి.. బాలు, మీనా కూడా షాక్ అవుతారు. దెబ్బ తగిలినా కూడా వంట ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. సత్యం తిట్టడంతో.. నేనే చేస్తానులే అని కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.