ఇవి లేకుండా ఈ దర్శకుల సినిమాలు ఉండవు

First Published May 28, 2019, 6:50 PM IST

ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాథ్ ఇలా టాలీవుడ్ లో చాలా మంది అగ్ర దర్శకులు ఉన్నారు. ప్రతి దర్శకుడు తమ చిత్రాల్లో కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. 

వివి వినాయక్ - సుమో బ్లాస్ట్స్: టాలీవుడ్ అగ్ర దర్శకులలో వివి వినాయక్ ఒకరు. మాస్ ఆడియన్స్ పల్స్ ఈ దర్శకుడికి బాగా తెలుసు. వివి వినాయక్ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాల్లో ఎక్కువగా సుమోలు గాల్లోకి ఎగురుతుండడం చూస్తుంటాం.
undefined
రాజమౌళి - ఆయుధాలు: రాజమౌళి దేశంలో అగ్రదర్శకుడిగా ఎదిగారు. రాజమౌళి ప్రతి చిత్రంలో హీరో, విలన్ల కోసం ప్రత్యేకమైన ఆయుధాలు ఉంటాయి. సింహాద్రి, విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో రాజమౌళి ఉపయోగించిన ఆయుధాలు అలరించాయి.
undefined
మురుగదాస్ - యాక్షన్, సందేశం : సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సినిమాలు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మురుగదాస్ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు అద్భుతమైన సందేశం కూడా ఉంటుంది.
undefined
రాఘవేంద్ర రావు- పళ్ళు,పూలు: దర్శకేంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాఘవేంద్ర రావు తన చిత్రాల్లో కథతో పాటు హీరోయిన్లని అందంగా చూపించడం కోసం ప్రత్యేక శ్రద్ద చూపిస్తారు. ఆయన చిత్రాల్లోని పాటల్లో పళ్ళు, పూలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
undefined
త్రివిక్రమ్ శ్రీనివాస్ - పంచ్ డైలాగ్స్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే పంచ్ డైలాగ్స్. త్రివిక్రమ్ కు మాటల మాంత్రికుడు అనే బిరుదు కూడా ఇచ్చేశారు. అతడు, జల్సా, జులాయి లాంటి చిత్రాల్లో త్రివిక్రమ్ పెన్ను పవర్ స్పష్టంగా కనిపిస్తుంది.
undefined
గుణశేఖర్ - భారీ సెట్టింగులు : ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ చిత్రాల్లో భారీ సెట్టింగులు అబ్బురపరిచే విధంగా ఉంటాయి.
undefined
పూరి జగన్నాథ్ - హీరోయిజం : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో పాత్ర ఆకర్షణీయంగా ఉంటుంది. హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేయడంలో పూరి దిట్ట. అందుకే ప్రతి హీరో పూరి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని కోరుకుంటారు.
undefined
శ్రీనువైట్ల - విపరీతమైన హాస్యం : శ్రీనువైట్ల చిత్రాలు ఎక్కువ భాగం ఆయన రూపొందించిన కెమెడీ సన్నివేశాల వల్లే విజయవంతం అయ్యాయి. పొట్ట చెక్కలయ్యే కామెడీ ఎపిసోడ్స్ సిద్ధం చేయడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తుడు.
undefined
కోడి రామకృష్ణ - గ్రాఫిక్స్ : కోడి రామకృష్ణ అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేయగలరు. కానీ ఆయన రూపొందించిన కొన్ని చిత్రాల్లోని గ్రాఫిక్స్ తెలుగు ఆడియన్స్ ని అబ్బుర పరిచేలా ఉంటాయి.
undefined
బోయపాటి శ్రీను - మాస్ యాక్షన్ : బోయపాటి శ్రీను ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తారు. బోయపాటి చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి.
undefined
రాంగోపాల్ వర్మ - క్రైం, హర్రర్ : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్కువగా హర్రర్, క్రైం అంశాలుండే కథలని ఎంచుకుంటుంటారు. ఇటీవల వర్మ మనసు బయోపిక్ చిత్రాలపై పడ్డట్లుంది.
undefined
ఆర్ నారాయణమూర్తి- విప్లవం : నటుడు, దర్శకుడు అయిన ఆర్ నారాయణమూర్తి ప్రతి చిత్రంలో విప్లవాత్మక భావజాలాలు కనిపిస్తాయి. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నారాయణమూర్తి విప్లవాత్మకత చిత్రాలతో ప్రత్యేకత చాటుకుంటున్నారు.
undefined
కృష్ణవంశీ - కుటుంబ బంధాలు: కృష్ణవంశీ తన చిత్రాల్లో ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆయన చిత్రాలు ఉంటాయి.
undefined
సుకుమార్ - ట్విస్ట్స్ : స్టార్ డైరెక్టర్ సుకుమార్ చిత్రాల్లో ఊహించని ట్విస్ట్ లు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లో ఊహించని మలుపులు ఉంటాయి.
undefined
click me!