మెయిన్‌గా ఈ సినిమాకి ఎమోషన్సే బలం. ఎందుకంటే రామాయణం కథ గురించి అందరికి తెలుసు. ఇప్పటికే సినిమాలు, సీరియల్స్, బుక్స్ రూపంలో చూశారు, చదువుకున్నారు. కొత్తగా చెప్పడానికి ఏం ఉండదు. కానీ దాన్ని ఎంత ఎమోషనల్‌గా నడిపించారనేదే ఇంపార్టెంట్. సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే ఆదరణ పొందుతుంది, లేదంటే డిజాస్టర్‌గా మారిపోతుంది. భావోద్వేగాలు ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వడమనే దానిపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. `ఆదిపురుష్` విషయంలో ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయితే, ఓం రౌత్ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం ఇండియన్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ అయిపోవాల్సిందే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇది జరుగుతుందా? లేదా? అనేది చూడాలి. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించిన `ఆదిపురుష్`కి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు.