Vishwanath and Sons day1 Collection: సూర్యకు తమిళ ప్రేక్షకుల షాక్, తెలుగులో దుమ్మురేపుతోన్న విశ్వనాథ్ అండ్ నన్స్, ఫస్ట్ డే వసూళ్లు ఎంత?

Published : Aug 15, 2026, 07:00 AM IST

Vishwanath and Sons day1 Collection: తమిళ హీరో సూర్య, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు బయటకువచ్చాయి. ఫస్ట్ డే ఈమూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?

PREV
14
మంచి ఓపెనింగ్స్ సాధించిన సూర్య సినిమా..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' (Vishwanath and Sons). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా శుక్రవారం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందుతోంది. మొదటి రోజు నుంచే ప్రేక్షకులలో అదిరిపోయే రెస్పాన్స్ ను సాధించడంతో .. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ కూడా ఈసినిమా సాధించింది.

24
మొదటి రోజు వసూళ్లు ఎంతంటే?

ఇండస్ట్రీ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) అందించిన లెక్కల ప్రకారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఇండియాలో మొదటి రోజు రూ. 17.51 కోట్ల గ్రాస్ కలెక్సన్స్ ను, 15. 15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ దాదాపు రూ. 27.51 కోట్లుగా నమోదు కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 5,034 షోలతో మొదలైన ఈసినిమా.. ఇండియా వ్యాప్తంగా దాదాపు 4,361 షోలలో ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకు తెలుగులో 46 శాతం, తమిళంలో 40 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది.

34
తమిళ, తెలుగు వెర్షన్ల కలెక్షన్స్

మొదటి రోజు వసూళ్లలో తమిళ వెర్షన్ అత్యధిక సహకారాన్ని అందించింది. తమిళంలో 2,679 షోల నుంచి 40 శాతం ఆక్యుపెన్సీతో దాదాపు రూ. 9.15 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది సినిమా. మరోవైపు, తెలుగు వెర్షన్ 1,682 షోల ద్వారా దాదాపు రూ. 6 కోట్ల నెట్ వసూలు చేసింది. విశేషమేమిటంటే, తెలుగు వెర్షన్ తమిళం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని (46 శాతం) నమోదు చేయడం గమనార్హం. తమిళ ప్రేక్షకులకంటే తెలుగువారే ఈసినిమాను ఎక్కువగా ఆధరిస్తున్నారు.

44
విశ్వనాథ్ అండ్ సన్స్ విశేషాలు

ఈ సినిమాలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపించారు. కుటుంబంలో తలెత్తిన ఒక సంక్షోభం తర్వాత అతని జీవితం ఎలా మారింది అనేది కథ. సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించగా.. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, రోమాన్స్, హ్యూమర్, డ్రామాలను మిళితం చేస్తూ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సూర్య చాలా తేలికపాటి (లైటర్) వినోదాత్మక పాత్రలో అలరించడం విశేషం. సెంటిమెంట్, కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వీకెండ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచే అవకాశం కనిపిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories