షాకింగ్ :'సైరా' 50 కోట్ల వివాదం! రెచ్చగొట్టి రేటు పెంచారా?

First Published Sep 22, 2019, 2:54 PM IST

ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరక్షన్ లో  చిరంజీవి హీరోగా  రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ  సినిమా  అక్టోబర్‌ 2న విడుదల కాబోతోంది. అందులో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసారు.ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ పూర్తి ఖుషీగా ఉన్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో  సినిమాపై ఒక వివాదం తెర మీదకు వచ్చి టీమ్ ని టెన్షన్ పెట్టడం మొదలెట్టింది.  

మోసం: ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి ఉయ్యాలవాడ బంధువులు ఆందోళన చేపట్టారు. అయితే సైరా సినిమా డైరెక్టర్, నిర్మాత మోసం చేసారని షూటింగ్ సమయంలో తమ ఆస్తులను, స్థలాలను వాడుకున్నరని, ఆర్దికంగా తమను ఆదుకోవాలని డైరెక్టర్‌ని కోరామని మొత్తం 23 మందికి కలిపి 50 కోట్లు ఇస్తామని ఒప్పుకుని ఇప్పుడు మోసం చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
undefined
50 కోట్లు.. కథ కు ఎవరైనా ఇస్తున్నారా: ఉయ్యాలవాడ వంశంలోని అయిదో తరానికి సంబంధించిన 23 మంది కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 'సైరా' నిర్మాత రామ్ చరణ్ పై, చిరంజీవిపై కూడా కేసు పెట్టారు. చూస్తే తెలుగులో తీస్తున్న ఓ కథకి 50 కోట్లు డిమాండ్ చేయటం అనేది సాధారమణమైన విషయం కాదు. వాళ్లు రాజీకి వచ్చేలా కనపడటం లేదు.
undefined
ఫ్యాన్స్ కు టెన్షనే:రామ్ చరణ్ సైతం ..తాను రూపాయి కూడా ఆ కుటుంబానికి ఇవ్వనని తేల్చి చెప్పారు. చూస్తూంటే సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ వివాదం ఇబ్బందిగా మారేలా ఉంది. అయితే ఉయ్యాలవాడ వంశీకులు వివాదం వెనక అసలు జరుగుతున్నదేమిటి..మెగా క్యాంప్ ఏ విషయాన్ని అయినా సామరస్య పూర్వకుండా సెటిల్ చేసుకుంటుంది. వివాదానికి తావివ్వటానికి చిరంజీవి ఒప్పుకోరు. అలాంటిది ఎందుకీ వివాదం మాటి మాటికీ రాజుకుంటుంది వంటి విషయాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.
undefined
అప్పుడు బడ్జెట్ 80 కోట్లే..ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునే సమాచారం మేరకు ....'సైరా' కథపై వివాదం కూడా ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే మొదలైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తియ్యడానికి పరుచూరి బ్రదర్స్ మొదట స్క్రిప్ట్ తయారు చేసారు. 'ఖైదీ నెంబర్ 150' రిలీజ్ అయిన తరువాత పరుచూరి బ్రదర్స్ కథతో, 80 కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమా తియ్యాలి అనుకున్నారు.
undefined
పరుచూరి స్క్రిప్ట్ సరిపోదు: కానీ బాహుబలి-2 సినిమా రిలీజ్ తరువాత, రామ్ చరణ్ 'సైరా'ని పాన్ ఇండియా సినిమాగా తియ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇండియా మొత్తానికి నచ్చే విధంగా సినిమా ఉండాలి. దాంతో అప్పటికే పరుచూరి బ్రదర్శ్ రాసిన కథ సరిపోదు అని అర్దమైంది. దాంతో మొదట నుండి నరసింహా రెడ్డి కథ తెలుసుకుని దాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు.
undefined
సురేంద్రరెడ్డి ఎంట్రీతో: ఆ క్రమంలో దర్శకుడుగా ఆ స్క్రిప్టు ని పూర్తి చేసి, తెరెక్కించే ఆ బాధ్యతలు సురేందర్ రెడ్డికి అప్పగించారు. ఆ మేరకు సురేందర్ రెడ్డి కూడా కర్నూల్ వెళ్లి అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరిగిన ప్రాంతాలు, పోరాటం జరిపిన ప్రదేశాలు తిరిగి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా కలిసి, మాట్లాడి, కొన్ని విషయాలు తెలుసుకుని వాటిని స్క్రిప్టులో కలిపి ఆ కథని ఒక కొలిక్కి తీసుకువచ్చారు.
undefined
15 లక్షలే: అందుకుకాను... తమ కుటుంబానికి చెందిన నరసింహా రెడ్డి కథ గురించి వివరాలు చెప్పినందుకు ఉయ్యాలవాడ వంశస్థులు రాయల్టీగా డబ్బులు అడిగటం జరిగింది. దాంతో .., మనిషికి కి 15 లక్షల వరకు ఇవ్వడానికి రామ్ చరణ్ మరియు చిరంజీవి ఒప్పుకున్నారు అని తెలుస్తోంది.
undefined
రెచ్చగొట్టి రేటు పెంచారా: కానీ ఆ తరువాత ఈ సినిమా గురించి, పెరిగిన బడ్జెట్ గురించి వార్తలు రావడంతో ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్న ఇద్దరు ఉయ్యాలవాడ వంశస్థులని రెచ్చగొట్టి మనిషికి 50 లక్షలు అడగమని చెప్పడంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. కూల్‌గా సెటిల్ అవ్వాల్సిన మ్యాటర్ కాస్త ఇలా రచ్చగా మారింది అని వినికిడి. దాంతో మొదట అనుకున్నదానికంటే చాలా ఎక్కువ అడగడంతోనే సైరా నిర్మాతలు మొదట చెప్పిన ఆ అమౌంట్ కూడా ఇవ్వకుండా ఆపారంటున్నారు.దాంతో ఈ వివాదం పెరిగింది. ఇదంతా ఫిల్మ్ నగర్ జనం చెప్పుకుంటున్న విషయాలు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది ఉయ్యాలవాడ వంశీయలకు, మెగా క్యాంప్ కు తెలియాలి.
undefined
వివాదం ఎలా పరిష్కరిస్తారో:ఈ వివాదాన్ని చిరంజీవి,రామ్ చరణ్ ఎలా సాల్వ్ చేస్తారో అని ఆసక్తిగా చూస్తోంది మీడియా. ప్రస్తుతం టీమ్ అంతా 'సైరా నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఫంక్షన్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
undefined
click me!