అలాగే బాలకృష్ణ నాయకత్వ లక్షణాలు, సీఎం పదవికి కూడా అంతే అని, అది కొందరికే సాధ్యమని, అందరు కాలేరని తెలిపారు. బాలకృష్ణ విషయంలోనూ అంతే అని, ఆయన కాలేదంటే దానికి సమాధానం లేదని, తానేం చెప్పలేనని తెలిపారు. కాలమే అన్నీ నిర్ణయిస్తుందని, టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరూ ఆపలేరని, ఎలాగైనా వస్తారని తెలిపారు. మెగాస్టార్‌ని దాటి ప్రభాస్ వచ్చినట్టు రాజకీయాల్లోనూ అది జరుగుతుందని, రేప్పొద్దున్న ఎన్టీఆర్ రాజకీయాలకు రావచ్చు అన్నారు. ఏమైనా కావచ్చు. ఇప్పుడు వద్దు అని ఆయన భావించి రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు, లేదంటే చంద్రబాబుతో, బాలయ్యతో గొడవలు ఉండొచ్చు, అవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ అన్నాక చాలా గొడవలు, మనస్పర్థాలు ఉంటాయని తెలిపారు శివాజీ.