ఈ క్రమంలో తరుణ్, రిచా ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. రిచాకు తెలుగులో ఆఫర్స్ వెల్లువెత్తాయి. తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ వచ్చింది. తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆమెకు ఎక్కడా బ్రేక్ రాలేదు. స్టార్ డమ్ తెచ్చే హిట్ పడలేదు. 2016లో విడుదలైన తెలుగు చిత్రం మలుపు లో చివరిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు.