తన ప్రాబ్లెమ్ ఓపెన్ గా చిరంజీవికి చెప్పేసిన షాయాజీ షిండే.. ఏం చేశారో తెలుసా, దటీజ్ మెగాస్టార్

First Published Jun 2, 2024, 11:12 AM IST

చిరంజీవి కెరీర్ లో మైలు రాళ్లు అని చెప్పుకోదగ్గ చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఠాగూర్ కూడా ఉంటుంది. రీమేక్ చిత్రం అయినప్పటికీ డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంటుంది. 

చిరంజీవి కెరీర్ లో మైలు రాళ్లు అని చెప్పుకోదగ్గ చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఠాగూర్ కూడా ఉంటుంది. రీమేక్ చిత్రం అయినప్పటికీ డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంటుంది. ప్రతి అంశంలోనూ ఠాగూర్ చిత్రం ప్రేక్షకులని మెప్పించింది. చిరంజీవి ద్వారా ఈ చిత్రంలోని సందేశం బలంగా ప్రేక్షకులకు చేరింది. 

ఈ చిత్రంలో చిరంజీవి, ప్రకాష్ రాజ్ తర్వాత అంతగా హైలైట్ అయిన పాత్ర విలన్ షాయాజీ షిండేది. తెలుగులో షాయాజీ షిండేకి ఇదే డెబ్యూ మూవీ. హిందీలో అల్లు అరవింద్ చూడాలని ఉంది చిత్రాన్ని కలకత్తా మెయిల్ అని రీమేక్ చేశారు. ఆ చిత్రంలో షాయాజీ షిండే నటించారు. ఠాగూర్ కోసం కొత్త విలన్ ని వెతుకుతున్న సమయంలో అల్లు అరవింద్.. చిరంజీవి, వినాయక్ కి షాయాజీ షిండే గురించి చెప్పారట. అలా షాయాజీ షిండే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. 

షాయాజీ షిండే నార్త్ ఇండియన్ కాబట్టి తెలుగు రాదు. దీనితో ఠాగూర్ చిత్రంలో చాలా ఇబ్బంది పడుతూ కనిపించారట. చిరంజీవి షాయాజీ షిండే టెన్షన్ పడుతుంటే గమనించి పిలిపించారు. దేనిగురించైనా కంగారు పడుతున్నారా అని అడిగారు. అవును సర్ కంగారుగానే ఉంది. నేను రంగస్థలం నటుడిని. డైలాగ్ నాకు అర్థం కాకపోతే ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ రావు. డైలాగులు అర్థం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారట. 

Chiraneevi

దీనితో వెంటనే చిరంజీవి వివి వినాయక్ ని పిలిపించి తెలుగు ట్రైనర్ ని ఏర్పాటు చేశారు. స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి డైలాగ్ ని షాయాజీ షిండేకి అర్థం అయ్యేలా నేర్పించారు అట. ఇదంతా ఒకెత్తయితే డబ్బింగ్ మరో ఎత్తు. 

తన పాత్రకి డబ్బింగ్ చెప్పడానికి కొత్త వాళ్ళని వెతుకుతున్నారు. అప్పుడు నేను చిరంజీవి గారి దగ్గరకి వెళ్లి.. సర్ నా పాత్రకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెబితే నా బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదు. ఛాన్స్ ఇస్తే నేనే ట్రై చేస్తాను అని అన్నారట. సరే ట్రై చేయి అని చెప్పారట. ఇబ్బంది పడుతూనే డబ్బింగ్ పూర్తి చేశాను. కేవలం డబ్బింగ్ చెప్పడానికే 15 రోజుల సమయం తీసుకున్నా. అయినా చిరంజీవి గారు ఏమి అనకుండా అర్థం చేసుకుని ప్రోత్సాహించినట్లు షాయాజీ షిండే తెలిపారు. 

ఠాగూర్ తర్వాత తనకి తెలుగులో ఒక్కసారిగా పది చిత్రాల్లో ఆఫర్ వచ్చినట్లు షాయాజీ షిండే తెలిపారు. అప్పటి నుంచి తెలుగులో ప్రతి ఏడాది మినిమమ్ 10 సినిమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూరి జగన్నాధ్ పోకిరి చిత్రంతో తన కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లినట్లు షాయాజీ షిండే పేర్కొన్నారు. 

Latest Videos

click me!