సమంత జోరుకి నెటిజన్ల బేజార్‌.. ఫ్రెండ్స్ తో పార్టీలో రచ్చ.. ఫోటో షూట్‌, ఈవెంట్లలో హల్‌చల్‌

Published : Aug 16, 2021, 02:07 PM IST

సమంత జోరుకి అంతా బేజార్‌ అవుతున్నారు. ఆమె ఎనర్జీకి పిచ్చెక్కిపోతున్నారు. ఓ వైపు నైట్‌ పార్టీలు, మరోవైపు ఫోటో షూట్లు, ఇంకోవైపు ఈవెంట్లతో సందడి సందడిగా ఉంది సమంత. తాజాగా ఈ వీక్‌ అప్‌డేట్‌ని పంచుకుని ఆశ్చర్యానికి గురి చేసిందీ అక్కినేని కోడలు. 

PREV
110
సమంత జోరుకి నెటిజన్ల బేజార్‌.. ఫ్రెండ్స్ తో పార్టీలో రచ్చ.. ఫోటో షూట్‌, ఈవెంట్లలో హల్‌చల్‌

స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత తాజాగా తన ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో తాను ఈ వీక్‌లో చేసిన విషయాలన్నింటిని వెల్లడించింది. వాటిని ఫోటో రూపంలో షేర్‌ చేసుకుంది సమంత. 

210

లేటెస్ట్ గా సమంత ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ సంస్థ ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో సమంత క్లీవేజ్‌ అందాలతో హోయలు పోయింది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. 
 

310

సమంత సినిమాలతోనే కాదు, కమర్షియల్‌ యాడ్స్ తోనూ బిజీగా ఉంది. అరడజన్‌ యాడ్స్ చేస్తుంది సమంత. అందులో భాగంగా ఓ ఫౌండేషన్‌ ఈవెంట్‌లో ఆమె స్పెషల్‌ గెస్ట్ గా హాజరై కనువిందు చేసింది. 

410

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ట్రెండీ వేర్‌లో సమంత మంత్రముగ్దుల్ని చేస్తుంది. నెటిజన్లని చూపులను తనవైపు తిప్పుకుంది.
 

510

దీంతోపాటు ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొంది. వైట్‌ టీషర్ట్ బ్లూ జీన్స్ లో ఆమె ఫోటో షూట్‌ వీడియో ని సైతం పంచుకోగా అది కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

610

ఆ తర్వాత `శాకుంతలం` సినిమాకి బాయ్‌ బాయ్‌ చెప్పినట్టు పంచుకుంది. దర్శకుడు గుణశేఖర్‌ ఫోటోని పంచుకుని ఆయనకు కిరీటం పెట్టింది. ఇటీవలే సమంత `శాకుంతలం` సినిమాలో తన పాత్ర పార్ట్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 
 

710

మరోవైపు ఫ్రెండ్స్ తో నైట్‌ పార్టీ చేసుకుంది. తనకిష్టమైన, తన వ్యాపారాల్లో భాగమైన స్నేహితులతో కలిసి పార్టీలో ఎంజాయ్‌ చేసింది సమంత. 

810

ఈ పార్టీ పిక్స్ ని సైతం సామ్‌ షేర్‌ చేసుకోగా, అవి వైరల్‌గా మారాయి. ఇందులో నాన్‌స్టాప్‌గా, ఎలాంటి హద్దులు లేకుండా ఎంజాయ్‌ చేసింది సమంత. ఆమె తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు చూస్తుంటేనే ఆ విషయం అర్థం చేసుకోవచ్చు. 
 

910

దీంతోపాటు జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్నట్టుగా ఓ వీడియోని పంచుకుంది సమంత. ఫిట్‌నెస్‌ కోసం తాను ఎంతగా కష్టపడుతుందో అనే విషయాన్ని కూడా ఆమె ఇందులో పేర్కొంది. ఈ వారంలో తాను చేసిన పనులను షేర్‌ చేసుకుంది.
 

1010

అలాగే ఇంట్లో తన పెట్‌ డాగ్‌తో ఫోటో కూడా ఉంది. దాంతో ఆడుకుంటున్న వీడియోలు, గ్లింప్స్ ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది సమంత. మొత్తంగా సమంత గత వారం ఆద్యంతం బిజీగా సాగిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories