
గెలుపు ప్రధానంగా సాగిన రామోజీ రావు నిజ జీవిత ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉన్నాయి, ఎన్నో తీపి గురుతులు, చేదు జ్ఞాపకాలు దాగివున్నాయనేది కాదనలేని సత్యం. మనిషి గా ఎంతో గొప్పవారు, మానవత్వం ఉన్న వ్యక్తి రామోజీరావు. అయితే వ్యాపారపరంగా ఎన్నో వ్యూహ, ప్రతివ్యూహాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను అమితంగా ఆరాధించేవారు ఉన్నారు. అలాగే తాము అనుకున్నట్లు రామోజీ లేరని ఏ మాత్రం ఇష్టపడనివారూ ఉన్నారు. అదే సమయంలో తమ అవసరం కోసం అభిమానంగా నటించేవారూ ఉన్నారు. రాజకీయంగా బద్ధ శత్రువులూ ఉన్నారు. వ్యాపారపరంగా రోల్ మోడల్ గా భావించేవారూ ఉన్నారు, తటస్థులూ ఉన్నారు. ఇలా ఒకే వ్యక్తి రకరకాల వ్యక్తులకు తమ అనుభవాలను బట్టి రకరకాలుగా కనిపించటంలో వింతా లేదు.
ఇక రామోజీరావుగారు సినిమా పరిశ్రమకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్, మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ని ప్రారంభించి కొన్ని వందల తెలుగు చిత్రాలనే కాకుండా, ఇతర భాషా చిత్రాలు కూడా పంపిణీ చేశారు. షూటింగులకు అత్యంత అనువైన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. సినిమా అనేది కళాత్మాక వ్యాపారం అని నమ్మిన వ్యక్తాయన. అశ్లీలతకు దూరంగా మంచి వినోదాత్మక, సందేశాత్మక కథ చిత్రాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటుచేశారు. తన తుదిశ్వాస వరకు అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అయితే అదే సమయంలో దర్శకరత్న దాసరి నారాయణరావుతో వివాదం చాలా కాలం నడిచింది. దాన్ని చిలవలు పలవుగా చాలా మంది చేసేసారు. ఏకంగా రామోజీరావు..దాసరిగారిని ఘోర అవమానం చేసారనే వార్తని ప్రచారం చేసారు.
కొన్నేళ్ల పాటు ఈనాడులోనూ, సితారలోనూ ఎక్కడా కూడా దాసరిగారు పేరు కనిపించేది కాదు. ఆయనకు సంభందించిన ఫొటోలు, వార్తలు వచ్చేవి కాదు. ఈ విషయం ఆ టైమ్ లో పనిచేసిన జర్నలిస్ట్ లు అందరికీ స్పష్టంగా తెలుసు. రాబోయే దాసరి నారాయణరావు సినిమాలు గురించి రాసేవాళ్లు కానీ అందులో దాసరి పేరు ఉండేది కాదు. ఇలా తన సొంత మీడియాలో దాసరిని ఎందుకు రామోజీరావుగారు బహిష్కరించారన్నది చాలా మందికి ప్రశ్నార్దంగా ఉండిపోయింది. చెరుకూరి రామోజీరావు, దాసరి నారాయణరావు.. తెలుగు కళారంగంలో ఇద్దరూ దిగ్గజాలే.. రామోజీరావు ప్రముఖ పారిశ్రామికవేత్త అయితే... దాసరి నారాయణ రావు సినీరంగంలో తిరుగులేని దిగ్గజం.. మరి ఈ ఇద్దరకూ గొడవలు వచ్చాయా.. ఆ గొడవలకు కారణమేంటి.
అయితే వీళ్లిద్దరి మధ్యా విభేధం రావటానికి కారణం సితారలో వచ్చిన చిన్న ఆర్టికల్ అంటారు అప్పటి పాత్రికేయులు. వారు చెప్పే దాని ప్రకారం అప్పుడు దాసరి నారాయణరావు వెలుగుతున్నారు. వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ ప్రక్కన కథలు వండుతూ మరో ప్రక్కన శిష్యులతో సినిమాలు నిర్మిస్తూ మరో ప్రక్క తను స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఓ ప్రవాహంలా ఉండేవారు దాసరి. ఆ స్దాయి డైరక్టర్స్ ఇప్పటికాలంలో ఎవరూ లేరు అనేది నిజం. అదే సమయంలో సితార కూడా ఓ వెలుగు వెలుగుతూ ఉండేది.
రామోజీరావుగారు ఎంతో ఇష్టపడి పెట్టిన సినిమా పత్రిక సితార. ఆ పత్రికలో సినిమా కవరేజ్ వచ్చిందంటే గ్రేట్ అన్నట్లు ఫీలయ్యేవారు సినిమా జనం. అంతలా జనంలోకి వెళ్లిపోయింది. ఈనాడు ఏజెంట్స్ అందరూ సితారను డిస్ట్రిబ్యూట్ చేసి మారు మూల పల్లెల్లోకి మరీ తీసుకెళ్లారు. ఆ పత్రికలో కొత్త కొత్త శీర్షికలు వచ్చేవి. స్టార్స్, డైరక్టర్స్ ఇంటర్వూలు స్పెషల్ ఫీచర్స్ వచ్చేవి. ఆ క్రమంలోనే సితారలో ఓ కొత్త ప్రయోగం చేసారు. అదేమిటంటే టెక్నీషియన్ లేదా హీరోతో ఓ రోజు. అలా హీరోలు, టెక్నీషియన్స్ తో రోజంతా సితార విలేఖరి గడిపి దాన్ని ఓ పేజీలో కవర్ చేసేవారు. అదీ బాగా క్లిక్ అయ్యింది.
Dasari Narayana Rao Property Row: Dasari Arun slams brother prabhu over allegations
ఆ క్రమంలో దాసరి తో ఓ రోజంతా సితార గడపి ఫొటోలతో వార్తను కవర్ చేయటానికి నిర్ణయించారు. దాసరి సరే అన్నారు. విలేఖరి ఓ రోజంతా వెళ్లి గడిపి కవర్ చేసారు. అద్బుతంగా వచ్చింది. అయితే ఇక్కడే చిన్న మెలిక పడింది. దాసరిగారు ఫుల్ బిజీ పర్శన్ కావటంతో ఓ ప్రక్కన షూటింగ్ , మరో ప్రక్క స్టోరీ డిస్కషన్, మరో ప్రక్క సినిమా ఓపినింగ్స్, ప్రెస్ మీట్స్ ఇలా వరస పోగ్రామ్ లు ఉన్నాయి. అవన్నీ కవర్ చేయటానికి ఓ పేజీ సరిపోక రెండు పేజీలు వేసారు.
కానీ సితార రూల్స్ ప్రకారం రెండో పేజీలో ఆ కాలం వెయ్యకుడదు. దాన్ని అతిక్రమించి వేయటంతో టీమ్...లిఖిత పూర్వకంగా ఆ విలేఖరిని వివరణ అడిగింది. దానికి వివరణ ఇస్తే అది అంతర్గత వ్యవహారంగా అక్కడితో ఆగిపోయేది. కానీ ఆ రిపోర్టర్ ఆవేదన పడి వెళ్లి తనను ఇలా అడిగింది ఈనాడు,సితార యాజమాన్యం అని దాసరి గారి దగ్గర కంప్లైంట్ చేసారు. దాంతో దాసరిగారికి కోపం వచ్చింది. తనమీద ఆర్టికల్ రాస్తే ఓ విలేఖరి ఇబ్బంది పడుతున్నారు అని ఆయన అనుకున్నారు.
Asianet News Silver Screen: Dasari Arun Lands in Another Controversy
అంతే తప్పించి అది సంస్ద యాజమాన్య నిర్ణయం, మనకు సంభందం లేదు అని దాసరిగారు భావించలేదు. కోపంతో ఆయన వెంటనే రామోజీరావుగారుకి స్వయంగా రిప్లై ఇచ్చారు. మీ పత్రికలో నా మీద ఆర్టికల్ ఇలా రాసినందుకు మీరు ఇబ్బందిపడ్డారని తెలిసింది. మీరు కనుక నా ఫొటోలు, నా గురించిన వార్తలు మీ మీడియా పత్రికల్లో వేయటానికి ఇబ్బందిగా ఉంటే వేయద్దు. రేపటినుంచే ఆపేయండి అన్నారు.
అది రామోజీగారికి చేరింది. అది మా పత్రిక పాలసి, మా పాలసి ప్రకారం ఒక పేజీ మించి వేయకూడదు. ఇది ఫ్యామిలీ మేటరు, మా రిపోర్టర్, ఎడిటర్ కలిసి నిర్ణయించుకుంటారు. అది మా క్రణశిక్షణకు సంభించిన విషయం. దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఇది మీ నోటీసుకురావటం, మీరు స్పందించటం మాకు ఇబ్బంది కరమైనది. ఏదైమైనా మీ మాటను గౌరవిస్తూ మీకు సంభందించిన వార్తలు కానీ, మీ ఫొటోలు కానీ మా పత్రికల్లో రానివ్వం. మీ పట్ల మాకు అపారమైన గౌరవం, అభిమానం ఉంది కాబట్టి మీరు అడిగినట్లే చేస్తాము అన్నారు.
అలా అప్పటి నుంచీ రామోజీరావుగారు కు సంభందించిన పత్రికల్లో దాసరి గారు పేరు నిషేధం అయ్యింది. ఇందులో తప్పు ఏది, ఎవరిది అని ఇన్నాళ్ల తర్వాత జడ్జి చేయలేం. కొన్నిసార్లు అపార్దాలు, అపోహలు లాగానే తొందరపాటు నిర్ణయాలు జరుగుతూంటాయి. ఇక ఈ విషయం జరిగిన కొంతకాలానికి ఉదయం పేపర్ ని దాసరిగారు పెట్టి ఈనాడుకు పోటీగా నిలబట్టే ప్రయత్నం చేసారు. చాలా కాలం సెన్సేషన్ వార్తలు,కాలమ్స్ తో నడిపారు కానీ పూర్తికాలం నడపలేకపోయారు.
Dasari Narayana Rao 3rd death Anniversary
ఇక తెలుగు ఈనాడు పత్రిక తిరుగులేని ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. కానీ దాసరి నారాయణరావు స్థాపించిన ఉదయం పత్రిక ఈనాడును సవాల్ చేసింది. సంచలన కథనాలతో తెలుగు జర్నలిజాన్ని పరుగులెత్తించింది. ఈనాడుకు దీటుగా నిలిచింది. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య వృత్తిపరమైన వైరం ఉండేది. ఆ తర్వాత కాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో దాసరి ఈ పత్రికను నడపలేకపోయారు.
సినిమాలు విషయానికి వస్తే రామోజీరావు గారు విలువలున్న చిత్రాలను అందించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఉషాకిరణ్ మూవీస్ ద్వారా.. తారాబలం కాకుండా కేవలం కథను మాత్రమే విశ్వసించి 85కుపైగా చిత్రాలను నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్‌లో అవకాశమంటే మార్కెట్‌లో క్రేజ్ ఉన్న ఏ కథనాయకుడైనా టక్కున కాల్షీట్లు ఇచ్చేవారు. కానీ రామోజీరావు మాత్రం తారలను సృష్టించే కథలను నమ్మారు.
అలా 1984లో దిగ్గజ హాస్య దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్న.. నరేష్, పూర్ణిమతో శ్రీవారికి ప్రేమలేఖని నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో మొదటి చిత్రం తోనే తెలుగు సినిమాతోనే తనదైన ముద్ర వేశారు. కథలనేవి కల్పనల్లోంచి కాదు, జీవితాల్లోంచి పుడతాయని ఉషా కిరణ్ మూవీస్ సంస్థ నిరూపించింది.