కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో 55వ ఎపిసోడ్ హీటెక్కించే విధంగా సాగింది. కొత్త కెప్టెన్ ని నిర్ణయించేందుకు బిగ్ బాస్ ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చారు. అనేక వాగ్వాదాలు మధ్య కొత్త కెప్టెన్ ఎంపిక జరిగిపోయింది. అంతకు ముందు జరిగిన పరిణామాలు కూడా చాలా ఆసక్తికరంగా సాగాయి.
హౌస్ లోకి సెకండ్ ఛాన్స్ తో రీ ఎంట్రీ ఇచ్చిన రతిక ఆమె పాత స్నేహితుడు పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషనల్ సంభాషణ సాగింది. స్టార్టింగ్ లో లవ్ బర్డ్స్ తరహాలో తిరిగిన రతిక, ప్రశాంత్ లు ఇప్పుడు గ్యాప్ మైంటైన్ చేస్తున్నారు. ప్రశాంత్ కూడా ఆమెని అక్కాఅని పిలుస్తున్నాడు. దీనితో ఇద్దరి మధ్య వివాదాలు సెటిల్ చేసుకునేందుకు రతిక ప్రయత్నించింది.
నన్ను అక్క అని పిలవొద్దు ప్రశాంత్ అంటూ రిక్వస్ట్ చేసింది. నేను అలాగే పిలుస్తా అంటూ ప్రశాంత్ మొండికేశాడు. నేను అక్క అంటే నువ్వు తమ్ముడు అన్నావు కదా అంటూ ప్రశాంత్ వాదించాడు. అప్పటి పరిస్థితులని వివరించే ప్రయత్నం చేసింది. స్టార్టింగ్ లో మనిద్దరం ఎలా ఉన్నాం.. ఇప్పుడు అక్క పిలుస్తుంటే చూసే వాళ్లకు ఎలా ఉంటుంది ? మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా.. నన్ను రతికా అని పిలువు అంటూ రిక్వస్ట్ చేసింది.
దీనితో ప్రశాంత్ పాత గొడవలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. నువ్వు మా ఇంట్లో వాళ్ళని అనరాని మాటలు అన్నావు. నేను ఇంత దూరం వచ్చింది నీచేత మా ఇంట్లో వాళ్ళని తిట్టించేందుకా అంటూ ప్రశాంత్ కంటతడి పెట్టుకున్నాడు. రతికా సారీ చెప్పినా ప్రశాంత్ వినలేదు.
మనిద్దరం స్టార్టింగ్ లో హార్ట్స్ మార్చుకున్నాం, చాలా చేశాం.. కానీ ఇప్పుడు గలీజ్ గా అక్క అక్క అంటుంటే ఎలా ఉంటుంది ? స్టార్టింగ్ లో నాపై ఉన్న ఫీలింగ్ ఇప్పుడు లేదా అంటూ ప్రశ్నించింది. అయినా ప్రశాంత్ వినిపించుకోకుండా నేను అక్క అనే పిలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. దీనితో శివాజీ ఇద్దరి మధ్యలో కల్పించుకున్నాడు. శివాజీ దగ్గర రతికా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంది. దీనితో శివాజీ ప్రశాంత్ కి నచ్చజెప్పి పాత విషయాలు మరచిపోయి ఫ్రెండ్స్ లాగా ఉండండి అని సూచించాడు. దీనితో ప్రశాంత్ ఒకే చెప్పి రతికా అని పిలవడం ప్రారంభించాడు.
ఇంతలో కెప్టెన్సీ టాస్క్ మొదలయింది. ఈ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ పోటీలో ఉన్న సభ్యుల్లో నచ్చని వారికి మిగిలిన ఇంటి సభ్యులు మిర్చీ మాల వేయాలి. వారు కెప్టెన్ గా ఎందుకు అనర్హులో రీజన్ చెప్పాలి. ఎవరి మెడలో తక్కువ మిర్చి మాలలు ఉంటే వారే కెప్టెన్. ముందుగా అమర్ దీప్ ప్రారంభించారు. మిర్చి మాల తీసుకుని ప్రశాంత్ కి వేశాడు. మిగిలిన వాళ్లంతా నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి నీకు వేసా అని అమర్ దీప్ తెలిపాడు. ఆఅమర్ చెప్పిన రీజన్ ప్రశాంత్ కి నచ్చలేదు. దీనితో ఇద్దరి మధ్య కాసేపు ఆర్గుమెంట్ జరిగింది.
దీనితో ప్రశాంత్ పుష్ప స్టైల్ లో తగ్గేదే లే అంటూ తొడ కూడా కొట్టాడు. ఆ తర్వాత యావర్.. శోభా మెడలో మిర్చి మాల వేశాడు. యావర్ చెప్పిన రీజన్ కూడా శోభాకి నచ్చలేదు. దీనితో వీరిద్దరి మధ్య వాగ్వాదం తార స్థాయికి చేరింది. శోభా యావర్ ఇద్దరూ హద్దులు దాటే విధంగా నోటికి పని చెప్పారు. నాక్కూడా ఛాన్స్ వస్తుంది రారా.. రీజన్ లేకపోయినా నెక్స్ట్ టైం నేను నిన్నే టార్గెట్ చేస్తా అంటూ శోభా రెచ్చిపోయింది. పిచ్చోడు అంటూ కామెంట్ చేసింది. ఆ కామెంట్ యావర్ కి నచ్చకపోవడంతో అతడు శోభా మీదికి ఆగ్రహంతో దూకాడు. శివాజీ కల్పించుకుని ఇద్దరినీ సెటిల్ చేశారు.
అందరి మెడలో మిర్చి మాలలు పడ్డాయి. కానీ గౌతమ్ కి మాత్రం ఎవరూ మిర్చి మాల వేయలేదు. దీనితో గౌతమ్ బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా అవతరించాడు. ఇంటి సభ్యులంతా అతడికి కంగ్రాట్స్ చెప్పారు.