ఆ విషయంలో పేరెంట్స్ ని బాధపెడుతున్న రష్మిక మందన్నా.. ఒంటరిగా ఉన్నా అలా జరగడంపై ఆవేదన

Published : Aug 05, 2021, 10:44 AM ISTUpdated : Aug 05, 2021, 12:33 PM IST

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా తన తల్లిదండ్రులను చాలా బాధపెడుతుందట. వాళ్లు చెప్పినా వినడం లేదట. రిస్క్ తీసుకుంటూ వారిలో సంతోషం లేకుండా చేస్తుందట. ఈ విషయాన్ని చెబుతూ తాను ఆవేదన చెందింది రష్మిక.   

PREV
111
ఆ విషయంలో పేరెంట్స్ ని బాధపెడుతున్న రష్మిక మందన్నా.. ఒంటరిగా ఉన్నా అలా జరగడంపై ఆవేదన

రష్మిక మందన్నా ఇప్పుడు ఎంత బిజీయెస్ట్ హీరోయిన్‌ అనేది అందరికి తెలిసిందే. క్రేజీ హీరోయిన్‌ కావడంతో ఆమెకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటు తెలుగు, అటు హిందీ, మరోవైపు తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. నిత్యం బిజీ బిజీగా గడుపుతుంది. కరోనాని కూడా లెక్క చేయకుండా తీరిక లేకుండా పనిచేస్తుంది. 
 

211

అయితే తాను ఇలా బిజీగా గడపడం తల్లిదండ్రులకు ఇష్టం లేదట. ఈ విషయాన్ని రష్మిక ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. `నేను వరుసపెట్టి సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం అమ్మానాన్నలకు ఆనందం కలిగించడం లేదు. కరోనా ముప్పు పూర్తిగా తొలగకపోవడంతో కొన్నాళ్లు సినిమా షూటింగ్స్‌ వాయిదా వేసుకోమని  నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తల్లితండ్రులుగా నాపై వారి కున్న ప్రేమకు సంతోషంగా ఉంది. కానీ చిత్రీకరణ వాయిదా వేయడం మన చేతుల్లో ఉండదు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నాను. కానీ వాళ్లు నా విషయంలో చాలా బాధపడుతున్నారు` అని తెలిపింది రష్మిక. 

311

రష్మిక ప్రస్తుతం తెలుగుతో  `పుష్ప`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్స్‌లో పాల్గొంటుంది. అలాగే ఇటీవలే ముంబైలో బాలీవుడ్‌కి చెందిన సిద్ధార్థ్‌ మల్హోత్రా `మిషన్‌ మజ్ను`, అమితాబ్‌తో `గుడ్‌ బై`తోపాటు మరో సినిమా చేస్తుంది రష్మిక. అమితాబ్‌తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ గురించి చెబుతూ, `అమితాబ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. లెజెండ్‌తో కలిసి సుదీర్ఘంగా పనిచేయడంతో చాలా విషయాలు తెలుసుకొనే అవకాశం దక్కింది. ఆయనతో సన్నిహితంగా ఉండే అవకాశం నాకు దక్కడం పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా

411

పాత్రకు తగినట్టుగా ఎలా ఫెర్ఫార్మెన్స్‌ చేయాలో అలాగే సెట్స్‌లో ఎలా సరదాగా ఉండాలి అనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకొంటున్నా.  సెట్లో మనకు ఎదురుగా ఉండే నటులు, డైరెక్టుర్లు కంఫర్ట్‌గా ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాంతో మనలోని ప్రతిభ కూడా బయటపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సెట్లో మధురానుభూతులను పొందడానికి ఛాన్స్ దక్కుతుంది` అని రష్మిక అన్నారు.
 

511

రష్మిక నిత్యం సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. నిత్యం తానేమీ చేసిందో అభిమానులకు క్లియర్‌ కట్‌గా చెబుతుంటుంది. ఓ రకంగా తన డైరీని సోషల్ మీడియాలో పెడుతుంది. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం చేస్తుంటారో అలా చెప్పుకుంటూ వెళ్తారు. అయితే అందులో ఎక్కువగా తన పెట్ ఆరా గురించి ఉంటుంది. 

611

జూలై 29వ తారీఖున తానేం చేసిందో రష్మిక చెప్పుకొచ్చింది రష్మిక. పొద్దున్నే లేచాను.. తిన్నాను.. టీవీ చూశాను.. మళ్లీ తిన్నాను.. ఆరాతో ఆడుకున్నాను.. మళ్లీ తిన్నాను.. పడుకున్నాను. ప్రతీ రోజూలానే ఈ రోజు కూడా చేసేశాను. నవ్వుకోవడానికి నాకు నేను చాలు.

711

అయితే ఇంట్లో నేను ఒక్క దాన్నే ఉంటున్నా కూడా నా హెయిర్ బ్యాండ్ మిస్ అవుతూనే ఉంది. ప్రపంచంలో అందరూ ఇలానే ఉంటారా? అని ఆశ్చర్యపోతుంటాను. ఈ ఏడాదిలో నేను బాధపడుతున్న విషయం అదే.. ఎప్పుడూ అది ఎక్కడ మిస్ అయిందా? అని ఇళ్లంతా చూస్తుంటాను. కానీ అది ఆరా పని అనుకుంటున్నా` అని రష్మిక చెప్పుకొచ్చింది.

811

మరోవైపు వరుసగా బాలీవుడ్ అవకాశాలు రావడంతో రష్మిక మందన్నా.. ముంబయిలోని బాంద్రాలో పూజా హెగ్డే కొన్న ఇంటికి సమీపంలోనే రష్మిక సైతం ఓ ఇల్లు కొనేందుకు ప్లాన్‌ చేస్తుందట. ఇదిలా ఉంటే కోలీవుడ్‌లో మరో ఆఫర్‌ని దక్కించుకుంది రష్మిక. 
 

911

ఈ భామ కోలీవుడ్‌లో శివకార్తికేయన్ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో కూడా ఈమెనే తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 

1011

రష్మిక మందన్నా సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని సాధించింది. ఈ అమ్మడి ఫాలోయింగ్‌ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. 

1111

`ఛలో` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తొలి చిత్రంతోనే ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది. తన అందంతో, అభినయంతో ఫిదా చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories