పారిస్ అందాల నడుమ చిల్ అవుతున్న రాశి ఖన్నా

Published : Mar 10, 2023, 07:13 AM ISTUpdated : Mar 10, 2023, 07:21 AM IST

ఎప్పుడూ.. సినిమాలు, షూటింగ్స్, బిజీ షెడ్యూల్.. ఇదేనా లైఫ్ అని అనుకుందో ఏమో.. హీరోయిన్ రాశి ఖన్నా చిల్ అవ్వడానికి విదేశాలకు చెక్కేసింది. అక్కడ రిలాక్స్ అవుతోంది. 

PREV
16
పారిస్ అందాల నడుమ చిల్ అవుతున్న రాశి ఖన్నా

ఎప్పుడూ బిజీ షెడ్యూల్స్ మధ్య నలిగిపోతుంటారు హీరోయిన్లు. దాంతో ఒత్తిడి ఎక్కువై స్ట్రెస్ తలకెక్కే లోపు.. చిల్ అవ్వడానికి ఉపాయాలు కూడా ఆలోచిస్తుంటారు. ఈక్రమంలో వారికి ఉన్న ఏకైక ఉపశమనం.. ఇష్టమైన ప్రాంతాన్ని ఎంచుకుని హ్యాపీగా ఓ టూర్ వేయడమే. ప్రస్తుతం హీరోయిన్ రాశీ ఖన్నా అదే పని చేస్తోంది. 
 

26

పారిస్ అందాల నడుమ చిల్ అవుతోంది రాశీ ఖన్నా. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఉరకలువేసు మనసును కంట్రోల్ చేసుకుంటూ ఈలోకాన్ని మర్చిపోయి మరీ.. ఆనందిస్తుంది, ఆస్వాదిస్తోంది. పారిస్ లో తన టూర్ కు సబంధించిన ఫోటోస్ ను రాశీ ఖన్నా ఇన్ స్టాలో శేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

36

కూల్ గా.. లైట్ కలర్ డ్రెస్  వేసుకుని, అక్కడి ప్రకృతిలో పులకరించి.. పరవశించిపోతోంది రాశీ. కూల్ పారిస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. పనిలో పనిగా.. అక్కడి ఐఫిల్ టవర్ తో ఓ ఫోటో దిగి పోస్ట్ చేసింది. అక్కడి వీధుల్లో షికారు చేస్తూ.. సెలబ్రిటీ అన్న విషయం పక్కన పెట్టి, కామన్ ఉమెన్ లా తెగ తిరిగేసింది. 
 

46

టాలీవుడ్ లో బాగా  వెనకబడింది  హీరోయిన్ రాశీ ఖన్నా.. ఇక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో.. బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. మధ్యలో కోలీవుడ్ ను కూడా టచ్ చేసింది బ్యూటీ. కాని తమిళంలో కూడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 
 

56

వరుసగా నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్  ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో  సౌత్ పై గ్రిప్ ను కోల్పోతోంది రాశీ ఖన్నా దాంతో హిందీలో పట్టు సాధిస్తోంది. అక్కడ అవకాశాలు  వరుసగా అందుతున్నాయి. బాలీవడ్ లో నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది.  సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన యోధ మూవీ చేస్తుంది బ్యూటీ. ఈసినిమా రిజల్ట్ తో రాశీ ఖన్నా బాలీవుడ్ లైఫ్ లో క్లారిటీ రాబోతోంది. 
 

66

తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ కూడా ఎక్కేసింది రాశీ ఖన్నా. హిందీలో రాజ్ డీకే డైరెక్ట్ చేసిన..ఫర్జీ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. షాహీద్ కపూర్ జంటగా.. ఆర్బీఐ ఆఫీసర్ పాత్రలో నటించిన బ్యూటీ... ఈ సిరీస్ లో  బోల్డ్ సీన్స్ తో అదరగోట్టింది కూడా. 

click me!

Recommended Stories