Ramayana Leak: అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రావణుడిగా యశ్, సీతగా సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
బాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో 'రామాయణ' సినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, అధికారికంగా ట్రైలర్ రిలీజ్ కాకముందే ఆన్‌లైన్‌లో కొన్ని క్లిప్స్ లీక్ అయ్యాయి. దీంతో నటీనటుల ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
24
రిలీజ్‌కు ముందే ట్రైలర్ లీక్
ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నా, ప్రస్తుతం అందరి దృష్టి రావణుడిగా నటిస్తున్న యశ్, సీతగా నటిస్తున్న సాయి పల్లవిపైనే ఉంది. లీకైన ట్రైలర్ క్లిప్స్‌లో యశ్ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రావణుడి పాత్రలో యశ్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాత్రకు యశ్ పూర్తి న్యాయం చేస్తారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
34
సాయి పల్లవి లుక్ పై నెటిజన్ల కామెంట్స్..
ఈ చిత్రంలో సీత పాత్రలో నటి సాయి పల్లవి లుక్ అద్భుతంగా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఆమె సహజ నటన పాత్రకు ప్రాణం పోస్తుందని అంచనాలు పెరిగాయి. యశ్, సాయి పల్లవి పాత్రల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. లీకైన వీడియో క్లిప్స్‌లో రణ్‌బీర్ కపూర్ ఉన్నప్పటికీ, యశ్, సాయి పల్లవి హైలైట్‌గా నిలిచారు.
అధికారిక ప్రకటనకు ముందే పాత్రల లుక్స్ బయటకు రావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారినా, వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ లీక్‌పై చిత్ర బృందం ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, రిలీజ్‌కు ముందే ఈ రేంజ్‌లో బజ్ క్రియేట్ అవ్వడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ప్రేక్షకులు ఇప్పుడు అధికారిక ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.