Upasana: పెళ్లి అయ్యాక చిరంజీవికి దూరంగా రామ్‌ చరణ్‌ వేరే కాపురం.. నిజాలు ఓపెన్‌గా చెప్పిన ఉపాసన

Published : Mar 23, 2026, 05:16 PM IST

రామ్‌ చరణ్, ఉపాసన ప్రేమించుకుని పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత వీరు పేరెంట్స్ నుంచి విడిగా ఉండాలనుకున్నారా?  ఉపాసన షాకింగ్‌ విషయం బయటపెట్టింది. 

PREV
15
ఇటీవల కవలలకు జన్మనిచ్చిన రామ్‌చరణ్‌, ఉపాసన జంట

రామ్‌ చరణ్‌ ఇటీవలే రెండోసారి తండ్రి అయ్యారు. చరణ్‌, ఉపాసనలకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే. మొదట కూతురు క్లీంకార జన్మించగా, ఆ తర్వాత ఇటీవల కవలలు కొడుకు, కూతురు జన్మించారు. వీరికి శివ్‌రామ్‌, అన్వీరా దేవిగా నామకరణం చేశారు. వీరి పుట్టుక, నామకరణం అంతా ఒక సెలబ్రేషన్‌ లాగా సాగింది. మొత్తానికి చిరంజీవి కోరుకున్నట్టుగానే ఆయన ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడు. ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.

25
రహస్యంగా ప్రేమించుకున్న రామ్‌చరణ్‌, ఉపాసన

ఈ క్రమంలో రామ్‌ చరణ్‌ పెళ్లికి ముందు జరిగిన ఒక సంఘటన బయటకు వచ్చింది. ఉపాసన ఓ క్రేజీ రహస్యాన్ని వెల్లడించింది. పెళ్లి తర్వాత ఫ్యామిలీకి దూరంగా ఉండాలనుకున్నారట. కానీ ఉపాసన చెప్పిన మాటతో మొత్తం మారిపోయింది. అసలేం జరిగిందంటే.. పెళ్లికి ముందే రామ్‌చరణ్‌, ఉపాసన ప్రేమించుకున్నారు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. కలిసి తిరిగిన రోజులు చాలానే ఉన్నాయి. అర్థరాత్రి సమయంలో వీరిద్దరు రైడ్‌కి వెళ్లేవారట. రామ్‌ చరణ్‌ చాలా సర్‌ప్రైజ్‌లు ఇచ్చేవారట. అవి తనని బాగా ఇంప్రెస్‌ చేసేవని తెలిపింది ఉపాసన.

35
పెళ్లి అయ్యాక వేరే కాపురం

అయితే ఓరోజు `పెళ్లి అయిన తర్వాత మనం ఎక్కడ ఉంటామని రామ్‌చరణ్‌ ని ప్రశ్నించింది ఉపాసన. దీంతో చరణ్‌ వెంటనే తాను కొన్నస్థలం గురించి చెప్పి, అక్కడ ఇళ్లు కడతా అని చెప్పాడట. అక్కడే ఉండొచ్చు అని ఆయన వెల్లడించారు. దీంతో ఉపాసన కాసేపు సైలెంట్‌ అయ్యింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఉపాసన తట్టుకోలేక తన మనసులో మాట చెప్పేసింది. పెళ్లి అయిన వెంటనే కుటుంబాన్ని వదిలేసి విడిగా ఎలా ఉండగలుగుతారు అని అడిగిందట. తాను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఒంటరిగా ఉండటం తనకు ఇష్టంలేదు, అందుకే అడిగిందట.

45
రామ్‌చరణ్‌ గొప్పతనం చెప్పిన ఉపాసన

దీనికి రామ్‌ చరణ్‌ స్పందించి వెంటనే అసలు విషయం చెప్పారు. వీకెండ్‌లోనే ఈ ఇంట్లో ఉంటామని, మిగిలిన రోజులు పేరెంట్స్ తోనే ఉంటామని చెప్పాడట. దీంతో తన మనసు కుదుట పడిందని తెలిపింది ఉపాసన. తన ఆలోచనలు, సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబానికి విలువ ఇవ్వడం చరణ్‌కి బాగా నచ్చుతాయని చెప్పింది. `అన్నింటినీ నిర్వహించడంలో నువ్వు చాలా సమర్థురాలివి` అని అంటుంటాడు చరణ్‌. తనలోనూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. చాలా మంది ఎదుటి వాళ్లకు చెప్పే అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. కానీ తను అలా కాదు, ఎదుటివాళ్లు చెప్పేది ఓపికగా వింటాడు. వాళ్లు చెప్పడం అయిపోయిన తర్వాతనే తన అభిప్రాయం చెబుతుంటాడు. ఏం మాట్లాడాలని ఆలోచించుకొని మాట్లాడుతుంటాడు. నా విషయంలో చాలా కేర్‌ తీసుకుంటాడు` అని చెప్పింది ఉపాసన. రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు ఉపాసన.

55
పెద్దితో బిజీగా రామ్‌ చరణ్‌

రామ్‌చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌ కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మూవీపై మంచి బజ్‌ ఉంది. రామ్‌ చరణ్‌ నటించిన గత సినిమా `గేమ్‌ ఛేంజర్‌`  డిజాస్టర్‌ గా నిలిచింది. ఈ నేపథ్యంలో `పెద్ది`తో బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని చూస్తున్నారు. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories