చీరకట్టులో ముద్దబంతిపువ్వువలె.. ఆరెంజ్ శారీలో మంత్రముగ్ధులను చేస్తున్న నాని హీరోయిన్

First Published | Oct 28, 2023, 10:33 AM IST

తమిళ ముద్దుగుమ్మ  ప్రియాంక మోహన్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫ్యాన్స్ ఖుషీ చేసేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిస్తూ ఆకర్షిస్తోంది. 
 

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో అవకాశం దక్కించుకుంటూ వస్తోంది. తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో రూపుదిద్దుకుంటున్న సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

వెండితెరపైనే కాకుండా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కూడా టచ్ లో ఉంటోంది. ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ నెట్టింట తరుచూగా ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. 
 


గ్లామర్ షోకు ప్రియాంక మోహన్ ఎంత దూరంగా ఉంటుందో తెలిసిందే. స్కిన్ షోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ఈ ట్రెడిషనల్ బ్యూటీ.. సంప్రదాయ దుస్తుల్లోనే అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టుతో మంత్రముగ్ధులను చేసింది. 
 

ఆరెంజ్ శారీలో ప్రియాంక మోహన్ పద్ధతిగా మెరిసింది. చీరకట్టులో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. తమిళ బ్యూటీ సొగసును ఆకర్షణీయమైన శారీ, మ్యాచింగ్ జ్యూయెల్లరీ మరింతగా మెరిపించాయి. ప్రకాశవంతమైన రూపంతో చూపుతిప్పుకోకుండా చేసింది.
 

చీరకట్టులో తరుచూగా దర్శనమిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది. చీరకే అందం తెచ్చింది. ఈ సందర్భంగా ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది. చుట్టూ ముద్దబంతిపూలు, మధ్యలో తమిళ బ్యూటీ సిట్టింగ్ ఫోజులు అదిరిపోయాయి. చూడగానే మైమరిపించే లుక్ తో ఫిదా చేసింది.
 

ప్రియాంక మోహన్ ట్రెడిషనల్ లుక్ కు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇక ప్రియాంక తమిళంలో ‘కెప్టెన్ మిల్లర్’, ‘బ్రదర్’ వంటి సినిమాలు చేస్తోంది. తెలుగులో OG, సరిపోదా శనివారం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!