
ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం గ్లోబల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతుంది. అంచెలంచెలుగా ఎదిగిన ఈ భామ సౌత్ టూ నార్త్, ఆ తర్వాత ఇండియా ఇప్పుడు వరల్ట్ రేంజ్‌కి ఎదిగింది. తనని తాను అద్భుతంగా మలుచుకుంటూ ఓ విజేతగా ప్రపంచం ముందు ఆవిష్కరించుకున్న ప్రియాంక చోప్రా నేడు నలభైవ(40)(Priyanka Chopra Birthday) పుట్టిన రోజుని జరుపుకుంటుంది.
ప్రియాంక చోప్రా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు, అరుదైన విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా రాణిస్తుంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తన కెరీర్‌లో, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్‌లో సెటిల్ అయిన, వరల్డ్ సినిమాపైన కూడా సక్సెస్ అయిన ఏకైక నటిగా ప్రియాంక చోప్రా రికార్డ్ సృష్టించడం విశేషం. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
హాలీవుడ్‌లో చాలా మంది ఇండియన్ స్టార్స్ నటించారు. దీపికా పదుకొనె, టబు, ఐశ్వర్యరాయ్, బిపాసాబసు, మల్లికా షేరావత్, శ్రీదేవి, అమితాబ్, ఇర్ఫాన్‌ఖాన్ వంటి ఎంతో మంది నటీనటులు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. కానీ అక్కడ సత్తా చాటలేకపోయారు. వారి సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో వీరిని మర్చిపోయే పరిస్థితి తలెత్తింది. దీపికా సైతం ప్రియాంక చోప్రాతో కలిసి హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె ఒకటి రెండు సినిమాలే చేసి బ్యాక్ అయ్యింది. అక్కడ సక్సెస్ కాలేకపోయింది.
కానీ ప్రియాంక చోప్రా మాత్రం తను నటించిన సినిమాలు సక్సెస్ కావడంతోపాటు తనుకూడా నటిగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే ఆమె చేతిలో ఆఫర్లు ఉండటం విశేషం. ఇదే ఆమె కెరీర్‌లో సాధించిన అతిపెద్ద మైల్‌స్టోన్‌గా చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రియాంక పూర్తి హాలీవుడ్‌కే పరిమితమయ్యింది. ఇండియన్(బాలీవుడ్) సినిమాలకు దూరంగా ఉంటుంది.
అంతేకాదు ప్రియాంక.. హాలీవుడ్‌కి చెందిన పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకుంది. అది కూడా ప్రియాంకకి కలిసొచ్చే అంశం. అక్కడే ఇళ్లు కొనుక్కుని సెటిల్ అయ్యింది. కేవలం ఇళ్లుకే పరిమితం కాకుండా ఏకంగా రెస్టారెంట్‌ని స్టార్ట్ చేసింది. అక్కడ ఇండియన్ ఫుడ్‌ని అందిస్తుంది. మొత్తంగా ఓ నటిగా, ఓ మహిళగా, వ్యాపారవేత్తగానూ అన్ని విషయాల్లోనూ ప్రియాంక సక్సెస్ అయ్యింది.
ఈ రకంగా ఇలా ఇండియన్స్ స్టార్స్ లో హాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన ఏకైక భారతీయ తారగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక రికార్డ్ సృష్టించిందని చెప్పాలి. ఇది ఎంతో మంది ఇండియన్ గర్ల్స్ కి, సినీ రంగంలోకి వస్తోన్న హీరోయిన్లకి ఆదర్శంగా నిలుస్తుంది. ఇక బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రియాంక చోప్రా `క్వాంటికో` టీవీ సిరీస్ తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అద్భుతమైన నటనతో మెప్పించింది.
ఆ తర్వాత `బేవాచ్` మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇది మంచి ఆదరణ పొందింది. దీంతో వరుసగా హాలీవుడ్ ఛాన్స్ లు క్యూ కట్టాయి. `ఏ కిడ్ లైక్ జేక్`, `ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్`, `హ్యాపీనెస్ కంటిన్యూస్`, `వియ్ కెన్ బీ హీరోస్`, `ది వైట్ టైగర్`, `ది మ్యాట్రికస్ రెసరెక్షన్స్` చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు `ఇట్స్ ఆల్ కమ్మింగ్ బ్యాక్ టూ మీ` చిత్రంలో నటిస్తుంది ప్రియాంక. మరోవైపు `పర్పుల్ పెబ్బుల్ పిక్చర్స్` బ్యానర్‌పై కంటెంట్ ప్రాధాన్యత కలిగిన చిత్రాలను నిర్మిస్తుంది.