Published : Jun 13, 2021, 10:00 AM ISTUpdated : Jun 13, 2021, 10:01 AM IST
`ఢీ` షోకి జడ్జ్ గా మరింత క్రేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రియమణి తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన భర్తతో జరిగే గొడవలు బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రియమణి పెళ్లైన తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. ఇందులో సమంత, మనోజ్ భాజ్‌పాయ్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

27
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి కెరీర్ గురించి, ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ప్రియమణికి ముస్తఫా రాజ్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో నటించడం విషయంలో భర్త ముస్తఫారాజ్ ప్రోత్సాహమే కారణమని తెలిపింది. ఆయన దొరకడం అదృష్టమని వెల్లడించింది. మ్యారేజ్ తర్వాతనే తనకు ఎక్కువ సినిమా ఆఫర్స్ వస్తున్నాయని పేర్కొంది.

37
అంతటితో ఆగలేదు, తమ మధ్య జరిగే గొడవలను కూడా బయటపెట్టింది ప్రియమణి. తమ మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయట. ఈ గొడవలు కామన్ అని తెలిపింది. గొడవల సమయంలో భర్తనే తగ్గుతాడని వెల్లడించింది. అంటే ప్రియమణినే కఠినంగా ఉంటుందని చెప్పకనే చెప్పింది.

47
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో తమకి మంచి ఫ్యామిలీ రిలేషన్ ఉందని వెల్లడించింది. విద్యాబాలన్, తను కజిన్స్ అట. విద్యా బాలన్ నటన, ఆమె ఎంచుకునే పాత్రలు తనకు నచ్చుతుందని, ఆమెని చూసి గర్వంగా ఫీలవుతానని వెల్లడించింది. బాలీవుడ్‌లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలను దాటుకుని స్టార్ హీరోయిన్‌గా నిలబడటం గొప్ప విషయమని చెప్పింది. అలాగే సింగర్ మాల్గాడి శుభగారు తమ చిన్న మేనమామగారి భార్య అని వాళ్లమ్మ తరఫువాళ్లందరూ సంగీతం రంగంలో ఉన్నారని చెప్పింది ప్రియమణి.

57
సినిమా అవకాశాల విషయంలో మైండ్ సెట్ మారిందని చెప్పింది. పెళ్లైతే హీరోయిన్లకి అవకాశాలు రావు, బాడీ షేమింగ్‌పై అనేక కామెంట్స్ వస్తుంటాయి. కానీ తనపై అలాంటి విమర్శలు రాలేదని చెప్పింది. పైగా మ్యారేజ్ తర్వాతనే హీరోయిన్‌గా మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలిపింది. సమంత, కాజల్ కూడా మెయిన్ లీడ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.
priyamani
67
కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి అదనపు భారం ఏర్పడుతుందని, అదే సమయంలో కొద్ది మందితోనే చిత్రీకరణ చేయాల్సి వస్తుందని చెప్పింది. అందుకే తాను కూడా కొంత పారితోషికం తగ్గించినట్టు పేర్కొంది.
priyamani
77
ప్రస్తుతం ప్రియమణి `ఢీ` షోకి జడ్జ్ గా చేయడంతోపాటు వెంకటేష్‌తో `నారప్ప` చిత్రంలో నటిస్తుంది. ఇందులో నటించడంపై `సినిమాకి మనం కలిసి పనిచేయాలని రాసి పెట్టి ఉందేమో` వెంకీ అనడం హ్యాపీగా అనిపించిందని చెప్పింది. ఈసినిమాతోపాటు `విరాటపర్వం`లో నక్సలైట్‌గా నటిస్తుంది ప్రియమణి. అలాగే హిందీలో `మైదాన్`లో, అలాగే `సైనైడ్`, `కొటేషన్ గ్యాంగ్` చిత్రాలు చేస్తుంది ప్రియమణి.