ఈ సందర్భంగా `రాధేశ్యామ్` చిత్రంపై తన కాన్ఫిడెంట్‌ని వ్యక్తం చేసిన ఆమె తన మనసులోని మాటని బయటపెట్టింది. తాను ఇప్పటికే తెలుగులో ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, నాగచైతన్య, అఖిల్, రామ్‌చరణ్‌లతో కలిసి నటించింది. ఇంకా ఎవరితో నటించాలనే డిజైర్ ఉందన్న ప్రశ్నకి పూజా స్పందించింది. ముగ్గురు హీరోలతో నటించాలనే కోరిక ఉన్నట్టు వెల్లడించింది.