ఫొటోలు: అల్లు అర్జున్ @ కుంటాల, తిప్పేశ్వర్‌

First Published Sep 14, 2020, 12:50 PM IST

సినీ హీరో అల్లు అర్జున్‌ కుటుంబ సమేతంగా అదిలాబాద్ లోని కుంటాల జలపాతాన్ని సందర్శించారు. అక్కడ జలపాతం జాలువారే అందాలను తిలకించారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను, ఇక్కడి ప్రకృతి అందాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలను వీక్షించారు. అంతకు ముందు హరితవనం పార్కులో మొక్కలు నాటారు.  అల్లు అర్జున్ టూర్‌ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కుంటాల జలపాతానికి క్యూ కట్టారు. తనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, స్థానికులతో అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించారు.ఆ క్రమంలో ఆయన్ను తమ ఫొటోలలో బంధించారు చాలా మంది ఫ్యాన్స్. వాటిలో కొన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ ఫొటోలు చూస్తే..రింగులు తిరిగిన జుట్టు… మాసిన గడ్డం… కండలతో అల్లు అర్జున్ మాస్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ పుష్ప సినిమా కోసం అని తెలుస్తోంది.
undefined
ఇక అల్లు అర్జున్ అక్కడ రాబోతున్నారని ముందుగా తెలుసుకున్న అభిమానులు గుమి గూడారు. తనని చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు.
undefined
ఆదివారం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అటవీ ప్రాంతానికి వెళుతుండగా జైనథ్‌ మండలం మాండగడ టోల్‌ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆయన వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు.
undefined
అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో తర్వాత పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లోకేషన్స్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు అందాల్ని చూడటానికి ఆయన వచ్చారు.
undefined
ఆదిలాబాద్ సమీపంలోని మావల హరిత వనాన్ని సందర్శించి మొక్కని నాటారు. తర్వాత మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అభయారణ్యం వెళ్లారు.
undefined
బన్నీతో పాటు కుటుంబ సభ్యులు, ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. అల్లు అర్జున్ టీమ్‌తో అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నారు.
undefined
ఎప్పటిలాగే ఈ టూర్ లోనూ ...హీరో అల్లు అర్జున్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. సినిమా షూటింగ్‌లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటిస్తున్నామని చెప్పారు.
undefined
కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వచ్చాయి.
undefined
ఇటీవల నిర్మాత దిల్‌ రాజు కుటుంబంతో జలపాతాన్ని సందర్శించారు. వీరికి అనుమతి వెనుక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదేశాలున్నట్లు తెలుస్తోంది.
undefined
మరోవైపు… పుష్పా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేదాని మీద ఎటువంటి సమాచారం ఇప్పటివరకూ లేదు. ఎంతగానో ఆకట్టుకున్న ఆదిలాబాద్‌ జిల్లా అందాలను ఎప్పటికీ మరువలేనివని అల్లు అర్జున్‌ అన్నారు.
undefined
జలపాతం వద్ద పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు సెలబ్రిటిలు, ప్రముఖులకు మాత్రం దగ్గరుండి జలపాతం అందాలను చూపించడం ఏమిటని కూడా ప్రశ్నలు సైతం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
undefined
ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప' షూటింగ్ మరోసారి వాయిదాపడినట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. 'అల వైకుంఠపురములో' సినిమా సాధించిన విజయం తరవాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రమైన 'పుష్ప'ను సుకుమార్ దర్శకత్వంలో షురూ చేశాడు.
undefined
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రం షూటింగును కేరళ అడవులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో లాక్ డౌన్ రావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
undefined
అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా కథాంశం ఎర్రచందనం నేపథ్యంలో సాగుతుంది.
undefined
ముందు అనుకున్నట్టుగా అక్టోబర్‌ కాకుండా డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారట. మొదటి షెడ్యూల్‌లో దాదాపు 40 శాతం వరకూ షూటింగ్‌ పూర్తయిందని తెలిసింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
undefined
click me!