పల్లవి ప్రశాంత్‌తో సీక్రెట్‌ మ్యారేజ్‌.. దిమ్మ తిరిగే కౌంటర్‌ ఇచ్చిన బర్రెలక్క.. అన్నని పెళ్లి చేసుకుంటారా?

Published : Jan 30, 2024, 11:41 PM ISTUpdated : Jan 30, 2024, 11:42 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌, సోషల్‌ మీడియా స్టార్‌, తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి సంచలనంగా మారిన బర్రెలక్క సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారా?  

PREV
17
పల్లవి ప్రశాంత్‌తో సీక్రెట్‌ మ్యారేజ్‌.. దిమ్మ తిరిగే కౌంటర్‌ ఇచ్చిన బర్రెలక్క.. అన్నని పెళ్లి చేసుకుంటారా?

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ అయిన వాళ్లు బిగ్‌ బాస్‌ ఫేమ్‌ పల్లవి ప్రశాంత్‌, తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్‌ శిరీష. ఈ ఇద్దరి పేర్లు మొన్నటి వరకు మారుమోగాయి. కానీ ఇప్పుడు ఇద్దరు సైలెంట్‌ అయ్యారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఓ సంచలన రూమర్‌ చక్కర్ల కొడుతుంది. దానికి బర్రెలక్క అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. 
 

27

బిగ్‌ బాస్‌ తెలుగు 7 లో విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి అసాధారణమైన ఆటతీరుతో టాప్‌లోకి వెళ్లాడు. శివాజీ వంటి యమాయములను వెనక్కి నెట్టి బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు. కానీ గ్రాండ్‌ ఫినాలే రోజు వివాదంలో ఇరుక్కొన్ని జైలు పాలయ్యాడు. కానీ పల్లవి ప్రశాంత్‌ కోట్లాది మందికి చేరువయ్యాడు.  నిజమైన హీరోగా పేరుతెచ్చుకున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చి ఇలా అసాధారమైన విజయాన్ని, పాపులారిటీని దక్కించుకోవడం విశేషం. అది గొప్ప విషయమనే చెప్పాలి. 

37
Pallavi Prashanth

అయితే విన్నింగ్‌ రోజు జరిగిన అల్లర్లు నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. బెయిల్‌పై విడుదలైన ఆయన కొన్ని ఈవెంట్లలోనే సందడి చేస్తున్నారు. చాలా వరకు ప్రైవేట్‌ లైఫ్‌ని జీవిస్తున్నారు. బయటకు రావడం లేదు. కోర్ట్ ఆదేశాల మేరకు ఆయన సైలెంట్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌ తో వచ్చిన క్రేజ్‌ని వాడుకునే పరిస్థితుల్లో ఆయన లేడు. 
 

47

మరోవైపు బర్రెలక్కగా పాపులర్‌ అయ్యింది శిరీష. నిరుద్యోగిగా ఆమె యూట్యూబ్‌లో పెట్టిన వీడియో వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత ఆమెని స్టార్‌ ని చేసింది. అంతేకాదు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. కానీ స్టేట్‌ మొత్తం అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఎన్నికల్లో ఓడిపోయినా, వ్యక్తిగా గెలిచింది. సెలబ్రిటీ హోదాని పొందింది. ఇప్పుడు ఆమె కూడా సైలెంట్ అయ్యింది. యూట్యూబ్‌ ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంది. 
 

57

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ ఫేస్‌ పల్లవి ప్రశాంత్‌, బర్రెలక్క పెళ్లి చేసుకున్నారనే రూమర్‌ ఇటీవల వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ సృష్టించాయి. ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన వాళ్లు కాబట్టి పెళ్లి చేసుకున్నారనే ప్రచారం స్టార్ట్ చేశారు. పెళ్లి అయినట్టుగా కొన్ని మార్ఫింగ్‌ ఫోటోలు కూడా పెట్టారు. ఇది ఓ యూట్యూబ్‌ యాంకర్‌ ద్వారా బర్రెలక్క దృష్టికి వెళ్లింది. 
 

67

దీనిపై తాజాగా బర్రెలక్క స్పందించింది. పల్లవి ప్రశాంత్‌ని పెళ్లి చేసుకున్నట్టు పుట్టించిన పుకార్లపై ఆమె స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ప్రశాంత్‌ అన్న రైతు కుటుంబం నుంచి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు తన సపోర్ట్ ఉందని, ఆయనకు సపోర్ట్ చేయాలని తాను వీడియో కూడా చేశానని, అందులో ఆయన్ని అన్నా అని పిలిచానని, అలాంటి అన్నతో పెళ్లి ఎలా ముడిపెడతారు, అలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నించారు. కొందరు తమ వ్యూస్‌ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పరువుని బజారున పడేస్తున్నారని మండిపడింది. 

77

ఇది తమ లైఫ్‌ అని, తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చింది. పల్లవి ప్రశాంత్‌ని తాను మొదట్నుంచి అన్నా అనే పిలిచానని, అన్నని ఎలా పెళ్లి చేసుకుంటారని, ఇదెక్కడి సంస్కృతి అంటూ ఆమె ప్రశ్నించింది. యూట్యూబ్‌ ఛానెల్స్ పై ఆమె ఫైర్‌ అయ్యింది. ఇలాంటివి మానుకోవాలని తెలిపింది బర్రెలక్క. తనపై ఫేక్‌ ప్రచారాలు మానుకోవాలని తెలిపింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories