మెగాస్టార్ ఎవరో తెలియదట, సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్ నికీషా పటేల్, ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..

Published : Apr 19, 2022, 07:42 AM IST

మెగాస్టార్ గురించి సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన నికీషా పటేల్.రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫ్యాన్ తో చిట్ చాట్ చేసిన బ్యూటీ.. సౌత్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేసింది.   

PREV
19
మెగాస్టార్ ఎవరో తెలియదట, సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్ నికీషా పటేల్, ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..

సౌత్ లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న బ్యూటీ నికీషా పటేల్‌. టాలీవుడ్ లో పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న కొమురం పులి సినిమాలో న‌టించి మెప్పించిన ఈ హీరోయిన్.. ఆతరువాత పెద్దగా అవకాశాలు లేక.. తెలుగు తెరకు దూరం అయ్యింది.  

29

ఇక సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు ఫుల్ యాక్టీవ్ గా ఉండే నికీషా.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చ గొడుతుంటుంది. ఇక రీసెంట్ గా  ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో  ఛాట్ చేసింది బ్యూటీ. వారు అడిగిన‌ ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. 
 

39

సౌత్ సినిమ గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పింది నికీషా పటేల్. ఇక తనకు పవన్‌ కల్యాణ్‌ గడ్డం అంటే ఎంతో ఇష్టమ‌ని పేర్కొంది. అయితే ఈ సందర్భంగా మెగాస్టార్‌ గురించి మీ అభిప్రాయం ఏంట‌ని అడిన ప్ర‌శ్న‌కు ఆమె స్పందిస్తూ.. సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలామంది మెగాస్టార్లు ఉన్నారని, ఏ మెగాస్టార్‌ గురించి అడుగుతున్నారని ప్ర‌శ్నించింది. 
 

49

దీంతో నెటిజన్స్ షాక్ అయ్యారు. మెగాస్టార్ అంటే ఎవరో తెలీదా? అని కొంద‌రు ఫ్యాన్స్ ప్ర‌శ్నించారు. పవన్ క‌ల్యాణ్ తో యాక్ట్ చేశావు కదా.. మరి నీకు మెగాస్టార్ ఎవరతో తెలియకపోవడం ఏంటీ అంటూ.. గట్టిగా అని నిల‌దీశారు. 

59

ప‌వ‌న్ క‌ల్యాణ్ సోదరుడు మెగాస్టార్‌ చిరంజీవి అన్న విషయం తెలియదా అని మరికొందరు నెటిజ‌న్లు అడిగారు. అంతే కాదు వరుసగా ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి ప్రవర్తన వల్లే.. ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలు రావడం లేదని విమ‌ర్శించారు. 

69

దీంతో నికీషా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ... సినీ ప‌రిశ్ర‌మ‌లో సల్మాన్‌ ఖాన్‌, మమ్ముట్టిని కూడా మెగాస్టార్ అని అంటారని  అటువంటి అపుడు మీరు ఏ మెగాస్టార్ గురించి అడిగారో ఎవరికి తెలుసు అన్నట్టు సమాధానం చెప్పింది. ఇక నెటిజన్ల కూడా కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. నెటిజ‌న్లు ఇలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని కొందరు కామెంట్లు చేశారు.

79

ఈ సంద‌ర్భంగా  నికీషా పటేల్ త‌న పెళ్లి గురించి కూడా స్పందించింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటార‌ని నెటిజన్లు  ప్ర‌శ్నించగా  ఆమె స‌మాధానం ఇస్తూ... త‌నకు పెళ్లి కొడుకు దొరికేశాడని, త‌న‌కు కాబోయే వాడు యూకేలో ఉంటున్నాడని నికీషా చెప్పింది.  తాము త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వివ‌రించింది. 
 

89

ఇక సౌత్ హీరోల గురించి ఆమె స్పందిస్తూ.. హీరో మహేశ్‌బాబు గురించి అభిప్రాయం ఏంటి అన్న ప్ర‌శ్న‌కు ఈ అమ్మ‌డు స్పందిస్తూ.. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అని స‌మాధానం ఇచ్చింది. ఇక‌ ప్రభాస్‌ తనకు మంచి స్నేహితుడ‌ని, చాలా పొడుగ్గా ఉంటాడ‌ని అంటోంది. 
 

99

ఇక సౌత్ లో టాలీవుడ్ హీరోల గురించ ఈరకంగా మాట్లాడిన నికీషా.. తమిళ సూపర్ స్టార్  రజనీ కాంత్ కింగ్‌ అంటూ పొగిడేసింది. అంతే కాదు తనకు  ఫేవరెట్ హీరో ధనుశ్‌ అని తెలిపింది బ్యూటీ. ఇక నికీషా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories