బాపు దర్శకత్వంలో తెరకెక్కిన రాధా గోపాళం చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని కెరీర్ ప్రారంభం అయింది. ఈ మూవీలో శ్రీకాంత్, స్నేహ జంటగా నటించారు. రాధాగోపాళం చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత నితిన్ నటించిన అల్లరి బుల్లోడు చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకుడు. నితిన్, త్రిష జంటగా ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.