ఆ సినిమాలు ఫ్లాప్, నీకు యాక్టింగ్ అవసరమా అన్నారు..నాన్నగారు చేసింది ఇదే, కళ్యాణ్ రామ్ కామెంట్స్ 

Published : Dec 24, 2023, 01:21 PM IST

తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

PREV
16
ఆ సినిమాలు ఫ్లాప్, నీకు యాక్టింగ్ అవసరమా అన్నారు..నాన్నగారు చేసింది ఇదే, కళ్యాణ్ రామ్ కామెంట్స్ 
Devil

తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బింబిసార తర్వాత ఇది కళ్యాణ్ రామ్ తో ఆమెకి రెండో చిత్రం.   

26

బింబిసార లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ జోరు పెంచారు.   కళ్యాణ్ రామ్ చిత్రాలపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.  ఆ క్రమంలో చివరగా విడుదలైన అమిగోస్ చిత్రం షాకిచ్చింది. అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టింది. ఈసారి నందమూరి హీరో బాక్సాఫీస్ ని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ 29న ఇయర్ ఎండ్ లో డెవిల్ అడుగుపెడుతున్నాడు. 

36

నెమ్మదిగా ప్రచార కార్యకమ్రాలు జోరందుకుంటున్నాయి. తాజాగా కళ్యాణ్ రామ్, డెవిల్ హీరోయిన్ సంయుక్త మీనన్ కలసి సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా షోకి అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో కళ్యాణ్ రామ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సుమకి ధీటుగా కామెడీ పంచ్ లు వేస్తూ ఆమెని ఆడేసుకున్నాడు. సుమ బింబిసార సాంగ్ కి డ్యాన్స్ చేయమని అడిగితే.. నాకు ఆ పాటలో డ్యాన్స్ లేదు నడవడమే డ్యాన్స్ అని చెప్పడంతో నవ్వులు పూశాయి. 

46

నటుడు షఫీ కూడా ఈ షోకి హాజరయ్యాడు. మా అమ్మ మా అమ్మ అంటూ సుమని ఆటపట్టించాడు. నేను మీ అమ్మ కాదురా రోషన్ వాళ్ళ అమ్మ అంటూ సుమ వేసిన సెటైర్ అదిరిపోయింది. ఇక కళ్యాణ్ రామ్ సుమ అడ్డా షోలో తన కెరీర్ గురించి, తండ్రి నందమూరి హరికృష్ణ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నేను హీరోగా నటించిన మొదటి రెండు చిత్రాలు తొలిచూపులోనే, అభిమన్యు తీవ్రంగా నిరాశపరిచాయి. 

56

చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. నీకు యాక్టింగ్ అవసరమా వెళ్ళిపో అని అన్నారు. కానీ ఆ టైమ్ లో నాకు అండగా నిలబడింది నాన్నగారు మాత్రమే నాన్న నీకు ఏది నచ్చితే అది చెయ్.. దేని గురించి ఆలోచించకు అని ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించినట్లు కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. 

66

కళ్యాణ్ రామ్ మాటలకు అక్కడున్న వారంతా క్లాప్స్ కొట్టారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర చిత్రానికి నిర్మాతలలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. 

 

click me!

Recommended Stories