విజయదశమికి బాలయ్య అన్‌స్టాపబుల్ 3.. అతిథులుగా చిరు, కేటీఆర్.. రచ్చ రచ్చేగా..

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదికపై అదరహో అనిపిస్తున్నాడు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 ని మించేలా సీజన్ 2 సూపర్ సక్సెస్ అయింది. 

Nandamuri Balakrishna unstoppable with nbk season 3 soon dtr

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఓటీటీ వేదికపై అదరహో అనిపిస్తున్నాడు. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 ని మించేలా సీజన్ 2 సూపర్ సక్సెస్ అయింది. టాక్ షోలలో నంబర్ 1 షోగా నిలిచింది. ఆహా వేదికపై ఈ షోకి అల్లు అరవింద్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  

Nandamuri Balakrishna unstoppable with nbk season 3 soon dtr

సీజన్ 1, సీజన్ 2 సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య సీజన్ 3కి రెడీ అవుతున్నారట. రీసెంట్ గానే ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది. తొలి రెండు సీజన్స్ ని మించేలా గ్రాండ్ గా అన్ స్టాపబుల్ సీజన్ 3 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా సైన్ చేయడం, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉంది. ఈ తరుణంలో బాలయ్య వేదికపై వేడెక్కించే ప్రశ్నలు సంధిస్తే షో మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. విజయదశమి రోజున సీజన్ 3 తొలి ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం లేదు. 

అదే సమయంలో అన్ స్టాపబుల్ 3లో పాల్గొనబోయే గెస్ట్ ల గురించి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ ఎపిసోడ్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు. ఇద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్ కి వచ్చే కిక్కే వేరు. 

అలాగే మెగా పవర్ స్టార్ రాంచరణ్, బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ లాంటి ప్రముఖులు కూడా ఈ షోకి అతిథులుగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా భగవంత్ కేసరి చిత్ర యూనిట్ తో ఒక ఎపిసోడ్ ఉంటుందని కూడా తెలుస్తోంది. 

నందమూరి బాలకృష్ణ తన ఎనెర్జీతో షోని ఎంతో హుషారుగా ముందుకి నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో బాలయ్య పొలిటికల్ గా ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనేది ఉత్కంఠగా మారింది. 

Latest Videos

vuukle one pixel image
click me!