Nagabandham Day 1 Collections: నాగబంధం మూవీకి దారుణమైన కలెక్షన్లు.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే?

Published : Jul 04, 2026, 10:42 AM IST

Nagabandham Day 1 Collections: అభిషేక్ నామా రూపొందించిన `నాగబంధం` మూవీ శుక్రవారం విడుదలైంది. ఇది నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో కలెక్షన్లు కూడా షాకిస్తున్నాయి. 

PREV
14
భారీ అంచనాలతో రిలీజ్‌ అయిన నాగబంధం

ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `నాగబంధం`. విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. అనసూయ, రిషబ్‌ సాన్వీ, జగపతిబాబు వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. అభిషేక్‌ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. టీజర్‌, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆడియెన్స్‌ నుంచి దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. విజువల్స్ బాగున్నాయి, కానీ సినిమాలో విషయం లేదనే టాక్‌ వినిపించింది.

24
నాగబంధం మూవీ కలెక్షన్లు

భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, ఓపెనింగ్ మరీ డల్ గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌తో, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన `రావు బహదూర్‌` స్థాయిలో ఈ మూవీ వసూళ్లు ఉండటం ఆశ్చర్యపరుస్తున్నాయి. `నాగబంధం` మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.5కోట్లు రాబట్టింది. ఇండియాలో దీనికి రూ.3.24కోట్లు  రాబట్టినట్టు సమాచారం. 

34
నాగబంధం మూవీ బడ్జెట్‌, నాన్‌ థియేట్రికల్‌ రైట్స్

`నాగబంధం` మూవీ సుమారు రూ.100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారట. పెద్దగా కాస్టింగ్‌ లేని సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు అంటేనే షాకిస్తోంది. మేకర్స్ చాలా పెద్ద రిస్క్ చేశారని చెప్పొచ్చు. ఈ మూవీకి నాన్‌ థియేట్రికల్‌ రూపంలో గట్టిగానే రాబట్టింది. ఓటీటీ రైట్స్ రూపంలో రూ.45కోట్లు వచ్చాయట. శాటిలైట్‌ రైట్స్ రూ.28కోట్లు, ఆడియో రైట్స్ రూ.7కోట్లు వచ్చినట్టు సమాచారం. ఇలా రిలీజ్ కి ముందే ఈ మూవీకి రూ.80కోట్లు రికవరీ అయినట్టు సమాచారం.

44
నాగబంధం థియేట్రికల్‌ బిజినెస్‌

ఇక థియేట్రికల్ రూపంలోనూ గట్టిగానే వచ్చింది. సినిమాకి తెలుగు రైట్స్ రూ.14కోట్లు, తమిళ రైట్స్, హిందీ రైట్స్, కన్నడ అన్నీ కలిపి రూ.4కోట్లు , ఓవర్సీస్‌ రైట్స్ నాలుగు కోట్లు అని సమాచారం. మొత్తంగా రూ.28కోట్లు థియేట్రికల్‌ రైట్స్ అని లెక్కకట్టారు. ఈ మూవీ థియేట్రికల్‌గా హిట్‌ కావాలంటే రూ.56కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టాలి. మరి ఈ మూవీకి వస్తోన్న టాక్‌కి ఇది సాధ్యమేనా అనేది పెద్ద ప్రశ్న. అయితే సినిమా విషయంలో నిర్మాతలు సేఫ్‌ అని చెప్పొచ్చు. కొన్న బయ్యర్లకి  ఎంత వస్తాయనేదే ప్రశ్న.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories