సురేఖ, పవన్ కళ్యాణ్ ముద్దు పేర్లు లీక్ చేసిన చిరు.. తండ్రి ఫోటో చూసి ఎమోషనల్

Published : Jan 11, 2023, 05:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయింది. ఒక వైపు బాలయ్య చిత్రం, మరో వైపు చిరంజీవి చిత్రం బాక్సాఫీస్ బరిలో ఉండడంతో ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. 

PREV
16
సురేఖ, పవన్ కళ్యాణ్ ముద్దు పేర్లు లీక్ చేసిన చిరు.. తండ్రి ఫోటో చూసి ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయింది. ఒక వైపు బాలయ్య చిత్రం, మరో వైపు చిరంజీవి చిత్రం బాక్సాఫీస్ బరిలో ఉండడంతో ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. రెండు చిత్రాల ట్రైలర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీనితో చిరంజీవి, బాలయ్య ఇద్దరూ ప్రచారం కోసం రంగంలోకి దిగారు. 

26

ఇటీవల సుమ హోస్ట్ గా మరో కొత్త టీవీ కార్యక్రమం ప్రారంభం ఐంది. సుమ అడ్డా పేరుతో ఈ గేమ్ షో ప్రారంభించారు. ఈ షో రెండవ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. చిరుతో పాటు డైరెక్టర్ బాబీ, వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు. 

36

జనవరి 14న చిరంజీవి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ప్రోమో చూస్తుంటే.. చిరంజీవి చాలా సరదాగా గడిపినట్లు అనిపిస్తోంది. జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను మెగాస్టార్ లుక్ లో కనిపించి డైలాగులు పేల్చాడు. శ్రీను మిమిక్రిని చిరంజీవి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ప్రోమోలో చిరంజీవి సతీమణి సురేఖ ప్రస్తావన ఎక్కువగా కనిపించింది. 

46

సుమ చిరంజీవిని కొన్ని సరదా ప్రశ్నలతో ఇరుకున పెట్టె ప్రయత్నం చేసింది. వెన్నెల కిషోర్ కూడా తనదైన శైలిలో రెచ్చిపోయాడు. సురేఖ చిరంజీవిని ప్రశ్నిస్తూ.. కుటుంబ సభ్యుల ముద్దు పేర్ల ఫోన్ లో ఎలా ఫీడ్ చేసుకుని ఉన్నారో చెప్పాలని అడిగింది. సురేఖ పేరు 'రే' అని ఫీడ్ చేసుకుని ఉన్నట్లు చిరు చెప్పడంతో అంతా నవ్వేశారు. 

56

ఇక చరణ్ పేరు చెర్రీ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ని అంతా పవన్ అని, పీకే ని అంటుంటారు. కానీ తనకి మాత్రం కళ్యాణ్ బాబు అంటూ తమ్ముడిపై ప్రేమ చాటుకున్నారు. షూటింగ్స్ వల్ల ఎక్కువగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వచ్చాను అని చిరంజీవి అన్నారు. 

66

మీ తండ్రిని మీరు ఎంతగా మిస్ అవుతున్నారు అని సుమ ప్రశ్నించింది. చిరంజీవి తన తండ్రితో కలసి ఉన్న ఫోటో కూడా చూపించింది. దీనితో చిరు ఎమోషనల్ అయ్యారు. నాన్నని ఎంతగానో మిస్ అవుతున్నానని అన్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Read more Photos on
click me!

Recommended Stories