'కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’ రివ్యూ

First Published Aug 23, 2019, 1:25 PM IST

స్పోర్ట్స్ డ్రామాలు తెలుగు నాట తక్కువే. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తూ తెలుగులోనూ ఆ తరహా సినిమాలు వస్తున్నాయి. మొన్నా మధ్య వచ్చిన జెర్శీ సినిమా పూర్తిగా క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కితే, మజిలి చిత్రం సైతం ఓ క్రికెటర్ లైఫ్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. ఆ సినిమాల విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే మరేమో కానీ తమిళంలో వచ్చిన క్రీడా నేపధ్య చిత్రం  ‘క‌నా’సినిమాని తెలుగులోకి రీమేక్ చేసారు.  అయితే మనకు వచ్చి నచ్చిన ఆ  క్రీడా చిత్రాల్లో నాని, నాగ చైతన్య వంటి స్టార్స్ ఉంటే ఇక్కడ మనకు పరిచయం లేని ఓ అమ్మాయి చుట్టూ కథ నడుస్తుంది. అయితే కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్ అంటారు కాబట్టి..అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమా మన వాళ్లను ఆకట్టుకునేలా ఉందా...స్టార్స్ లేకుండా వచ్చిన ఈ స్పోర్ట్స్  చిత్రం నిలబడుతుందా... అసలు తెలుగులోకు రీమేక్ చేయాలనిపించేటంత గొప్ప కథ ఈ సినిమా లో ఉందా..ఉంటే అదేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

--సూర్య ప్రకాష్ జోశ్యుల

కథ: రైతు కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) కు క్రికెట్ అంటే పిచ్చి. ముఖ్యంగా ఇండియా ఎప్పుడూ గెలవాలని కోరుకునే అతను, ఓడిపోతే తట్టుకోలేడు. ఆయన కుమార్తె కౌశల్య (ఐశ్వర్యారాజేష్) కూడా తండ్రిలా మెల్లిగా క్రికెట్ పై అభిమానం పెంచుకుంటుంది. అంతేకాదు తండ్రికు ఆనందం కలిగేలా తను క్రికెటర్ అయ్యి...ఇండియాను గెలిపించాలనుకుంటుంది. అయితే పల్లెటూళ్లలో అంతలా ఆడపిల్లలు క్రికెట్ ఆడే పరిస్దితి లేదు. దాంతో కౌశల్య మగాళ్ల టీమ్ లోనే కలిసి ఆడటం మొదలెడుతుంది. ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటని చాలా మంది ఆమె తండ్రిని తిడుతూంటారు. అయినా తండ్రి, కూతుళ్లూ ఎక్కడా వెనకడుగు వెయ్యాలనుకోరు. మరో ప్రక్క రైతుగా కృష్ణమూర్తి పరిస్దితి ఏమీ బాగుండదు. వ్యవసాయం కోసం తెచ్చిన లోన్స్ తడిసి మోపెడు అయ్యి...చివరకు ఇంటిని జ‌ప్తు చేసే సిట్యువేషన్ వస్తుంది. మరో ప్రక్క కౌశల్యకు క్రికెటర్ గా ఎదగటానికి రకరకాల సమస్యలు వస్తాయి. ఆ పరిస్దితుల్లో కృష్ణమూర్తి ఏం డెసిషన్ తీసుకున్నాడు...కౌశల్య తన తండ్రి కోసం ఇండియా తరుపున ఆడి గెలిపించిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఎలా ఉందంటే... వాస్తవానికి ఇదొక కొత్త కథగా అనిపించదు..ఇలాంటి కథ ఇలాగే జరుగుతుంది అన్నట్లు ప్రెడిక్టుబల్ గా సాగుతుంది. అందుకు కారణం ఫార్ములాగా సినిమా సాగటం. సినిమాలో ట్విస్ట్ గా కోచ్ ..చీకటి గతాన్ని చెప్పినా, అదీ కొత్తగా అనిపించదు. దానికి తోడు రెండు ఇష్యూలకు సమాన ప్రయారిటీ ఇస్తూ దర్శకుడు కథనం నడుపుతాడు. దాంతో మనకి ప్రత్యేకంగా తండ్రి, కూతుళ్లలో ఎవరిని పూర్తిగా ఫాలో కావాలనే కన్ఫూజన్ ఏర్పడుతుంది. లవ్ ట్రాక్, వెన్నెల కిషోర్,రంగస్దలం మహేష్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఆకట్టుకునేలా లేవు. దీనికి తోడు చాలా చోట్ల లింప్ సింక్ సమస్యలు. తమిళ సీన్స్ యాజటీజ్ ఇక్కడ కట్ అండ్ పేస్ట్ చేసారు. అవి చూసేవారిలో పాజిటివ్ ఇంపాక్ట్ కలిగించలేకపోయారు.
undefined
ఓ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ చేస్తే ..ఓహో తమిళ డబ్బింగ్ సినిమా అని చూస్తాం..తెలుగు రీమేక్ అంటూ డబ్బింగ్ లా ఉండటం, బడ్జెట్ పరంగా కలిసిరావటానికే అయ్యిండవచ్చు కానీ సినిమాపై ఉన్న ఇంప్రెషన్ ని పోగొడతాయి. ఏదైమైనా ఇరవై నిముషాల సేపు క్రికెట్ మ్యాచ్ ని చూపెట్టడం అనేది క్రికెట్ లవర్స్ కు ఈ సినిమాని టార్గెట్ చేసారని అర్దమవుతుంది. ఐశ్వర్యా రాజేష్ ..తెలుగు అమ్మాయే కావచ్చు కానీ మనకు అసలు పరిచయం లేని మొహం. కాకపోతే మంచి ఫెరఫార్మర్. ఇక గెస్ట్ రోల్ చేసిన శివ‌కార్తీకేయ‌న్ ఎవరో చాలా మంది కు తెలియదు. తెలుగులో ఏ హీరో ని అయినా గెస్ట్ గా తీసుకోవాల్సింది. ఇక దర్శ కుడుగా భీమినేని గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు. ఆయన రీమేక్ రాజా. దాంతో క్రికెట్ నేప‌థ్యంలో సాగే సీన్స్ అన్నీ బాగా ఎలివేట్ అయ్యేలా తీశారు. అవి న‌చ్చుతాయి కూడా. ఓ పల్లెటూరి సాధార‌ణ‌మైన అమ్మాయి, జాతీయ స్థాయి క్రికెట‌ర్‌గా ఎదిగిన వైనం స్ఫూర్తినిచ్చేలా తీసారనటంలో సందేహం లేదు. అయితే ఆ స్పూర్తి ఎంత మంది తీసుకుంటారనేది చూడాలి.
undefined
టెక్నికల్ గా .. సినిమాలో చెప్పుకోదగినివి డైలాగ్స్. అలాగే పాట‌లు కూడా న‌చ్చుతాయి. కెమెరా వ‌ర్క్ బాగుంది. అయితే ‘క‌ణ‌’లోని సీన్స్ స‌గానికి పైగా వాడుకోవటం జరిగింది. దాంతో చాలా చోట్ల ఇది డ‌బ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది. కాబట్టి డైరక్షన్ గురించి పెద్దగా మాట్లాడుకునేదేం లేదు. అయితే తెలుగు వెర్షన్ కోసం చేసిన సీన్స్ లో మాత్రం ఆయన సీనియారిటి కనపుడుతంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో రాజేంద‌ప్ర‌సాద్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్ ని డీల్ చేసిన తీరు ఆయన ప్రతిభను మనకు చూపిస్తుంది. నటీనటుల్లో ఐశ్వర్యా రాజేష్ ఫెరఫార్మెన్స్ సూపర్బ్. రాజేంద్రప్రసాద్..ఏమిటో ఏ పాత్ర చేసినా ఒకే రకంగా చేస్తున్నారు.
undefined
ఫైనల్ థాట్ ఒకే ఒరలో రెండు కత్తులు...మహిళా క్రికెటర్ కష్టాలు.. రైతు నష్టాలు
undefined
కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’ రివ్యూ Rating: 2.5
undefined
click me!