నేను శైలజ చిత్రంతో Keerthy Suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది.