Katrina Kaif : కత్రినా కైఫ్ అతన్ని ఎందుకు దాస్తోంది? బైక్ రైడ్ అంటూ భలే ట్విస్ట్ ఇచ్చిందిగా!

Published : Dec 24, 2023, 11:16 AM IST

స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ Katrina Kaif  నెక్ట్స్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కానీ చివరల్లో ట్విస్ట్ ఇచ్చి మేటర్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. 

PREV
15
Katrina Kaif : కత్రినా కైఫ్ అతన్ని ఎందుకు దాస్తోంది? బైక్ రైడ్ అంటూ భలే ట్విస్ట్ ఇచ్చిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రతినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించి ఇక్కడి ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ గా ఎదిగింది. భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు.

25

ప్రస్తుతం సినిమాల జోరు కాస్తా తక్కువగానే ఉంది. కానీ భారీ ప్రాజెక్ట్స్ ల్లోనే నటిస్తూ వస్తోంది. మునుపటిలా కాకుండా ప్రాధాన్యత పాత్రల్లోనే నటిస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటోంది. రీసెంట్ గానే  సల్మాన్ ఖాన్ సరసన ‘టైగర్ 3’ Tiger 3 చిత్రంతో అలరించింది.

35

ఈ యాక్షన్ మూవీలో స్టంట్స్ తో ఆకట్టుకుంది. నెక్ట్స మేరీ క్రిస్టమస్ (Merry Chistmas)  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సౌత్ స్టార్ విజయ్ సేతుపతి Vijay Sethupathi, కత్రినా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 2024 జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. 
 

45

ఈ సందర్భంగా కత్రినా కైఫ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన బైక్ రైడింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ‘జిందగీ నా మిలేగి దోబరా’ మూవీ టైమ్ లోనే స్పెయిన్ లో తను బైక్ రైడింగ్ నేర్చుకున్నట్టు చెప్పుకొచ్చింది. 

55

బైక్ రైడింగ్ స్కిల్స్ కోసం తను బాంద్రాలోని స్ట్రీట్స్ లో ప్రాక్టీస్ చేసిందని చెప్పింది. షూటింగ్ వెళ్లే ముందు, లేట్ నైట్స్ లో రైడ్ చేసేదాన్ని అని వివరించింది. ఆ సమయంలో తన వెంట టూటర్ కూడా ఉండేవాడని చెప్పింది. కానీ ఆ టూటర్ మాత్రం సీక్రెట్ అంటూ దాచేసింది. 

click me!

Recommended Stories